-Advertisement-

TGPSC GROUP 1 RESULTS: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

TGPSC GROUP 1 RESULTS TSPSC GROUP 1 RESULTS TSPSC GROUP 2 TS TET TS DSC results AP TET AP DSC AP TET NOTIFICATION AP TET ONLINE APPLICATION AP DSC NOT
Peoples Motivation

TGPSC GROUP 1 RESULTS: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల 

  • జూన్ 9న తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణ..
  • నేడు ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ..
  • మెయిన్ కు అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం..

TGPSC GROUP 1 RESULTS TSPSC GROUP 1 RESULTS TSPSC GROUP 2 TS TET TS DSC results AP TET AP DSC AP TET NOTIFICATION AP TET ONLINE APPLICATION AP DSC NOT

హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. అక్టోబరు 21-27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షలో మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని తెలిపారు.

ఇక, ప్రిలిమ్స్ లో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దానికోసం ప్రయత్నించడం, విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడాన్ని ఒక వ్యాపకంగా పెట్టుకున్నవారు ఎప్పటికైనా విజయతీరాలకు చేరతారని తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

తెలంగాణలో జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ జరగడం తెలిసిందే. ఈ పరీక్షకు 3.20 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు టీజీపీఎస్సీ ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Comments

-Advertisement-