Srisailam: శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం, నంది విగ్రహం..
Srisailam to Sikharam distance
Nandi basavanna photos
Srisailam sikharam images
Story of Srisailam Jyotirlinga
Shikaresvara Temple Srisailam
Temples
By
Pavani
శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం..
సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా బయటపడిన శివలింగం..
శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం..
శివలింగం పక్కనే రాయిపై 14
15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపితో రాతలు..
Srisailam: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరో పురాతన శివలింగం బయటపడింది.. దేవస్థానం యాఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడినట్టు అధికారులు తెలిపారు.. సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో చదును చేస్తుండగా శివలింగం బయపటడిందని చెబుతున్నారు.. శివలింగంతో పాటు అదే రాయిపై నంది విగ్రహం కూడా ఉంది.. మరోవైపు.. శివలింగం పక్కనే రాయిపై తెలియని లిపితో రాసి ఉన్న గుర్తులు ఉన్నాయి.. బయటపడిన శివలింగాన్ని పరిశీలించిన దేవస్థానం అధికారులు.. శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు పంపించారు.. దానిపై అధ్యయనం చేసిన అధికారులు.. బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న లిపి 14, 15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు.. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్ర గుండం వద్ద ప్రతిష్టించినట్లు లిపిలో ఉన్నట్టు వెల్లడించారు.. మైసూరుకు చెందిన ఆర్కియాలజీ అధికారుల ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు అధికారులు..
Comments