SR Nagar Crime:హైదరాబాద్ లో కర్నూలు యువకుడి దారుణ హత్యా..!
SR Nagar Crime:హైదరాబాద్ లో కర్నూలు యువకుడి దారుణ హత్యా..!
- ఎస్సార్ నగర్ లో కర్నూలు యువకుడి దారుణ హత్యా..
- హాస్టలో గొడవ లేక ప్రేమ వ్యవహారమా..?
- ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారా..?
- గణేష్ ను అదుపులో తీసుకుని విచారిస్తున్న పోలీసులు
హైదరాబాద్, జులై 28 (పీపుల్స్ మోటివేషన్):-
SR Nagar Crime: భాగ్యనగరంలో నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోడ్డుపై కొందరిని చంపేస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోతున్నారు. దొరికిన వారిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. దీంతో రోడ్లపైకి వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజానీకం.. కళ్ల ముందే ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్యకు గురవుతున్నా.. భయంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోని ఓ హాస్టల్ లో దారుణ హత్య నగరంలో కలకలం రేపింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో మర్డర్ నగరంలో వెంకటరమణ ఉంటున్నాడు. వెంకటరమణ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే టీచర్ వెంకటరమణతో పాటు హెయిర్ కట్ షాప్ లో పనిచేసే బార్బర్ గణేష్ కూడా హనుమ హాస్టల్లోని షేరింగ్ రూమ్ లో కలిసి ఉంటున్నారు. ఇద్దరు బాగానే ఉండే వారు. అయితే గణేష్ రోజూ మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం. దీంతో గణేష్ .. వెంకటరమణపై కోపం పెంచకున్నాడు. అతన్ని ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇక వెంకటరమణ పడుకుంటున్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో గణేష్ దాడి చేశాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో వెంకటరమణ ఒక్కసారి కుప్పకూలి పోయాడు. రూం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన గణేస్ అతనిపై దాడి చేయడంతో కింద పడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే హాస్టల్ యువకులు యాజమాన్యంకు తెలియజేశారు.
హనుమ హాస్టల్ వారు వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు. అంతే కాకుండా సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పలువురు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. వెంకటరమణపై గణేష్ దాడి చేస్తున్నప్పుడు రూం లో లేకపోవడం పై పలు అనుమానాలకు దారితీస్తుంది. ఒక వేళ ఇద్దరు సేరింగ్ రూంలో ఉంటే వెంకట రమణపై గణేష్ దాడి చేస్తున్నప్పుడు అరుపులు కూడా బయటకు వినిపించకపోవడం పై దర్యాప్తు చేస్తున్నారు. హాస్టలో గొడవ లేక ప్రేమ వ్యవహారమా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక వేల ప్రేమ వ్యవహారమే అయితే గణేష్, వెంకటరమణ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారా?లేక టీచర్ గా పని చేస్తున్న వెంకటరమణ స్టూడెంట్ గా పనిచేస్తున్న అమ్మాయిని ఇద్దరూ ప్రేమించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గణేష్ ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. వెంకటరమణ బంధువులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.