Smart Phones: చిన్నారుల పాలిట శాపం.. స్మార్ట్ ఫోన్లు
Smart Phones: చిన్నారుల పాలిట శాపం.. స్మార్ట్ ఫోన్లు
నేటి యుగంలో చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ లేని క్షణం కూడా ఉండలేకపోతున్నారు. వారికి సమయానికి ఆహార పానీయాలు కూడా అక్కరలేదు. వారి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమంతా తను గుప్పెట్లో ఉన్నట్లేనని బ్రమపడుతున్నారు. దానివలన కలిగే నష్టాలను ఎవ్వరూ ఊహించడం లేదు. దీనివలన చిన్నారులు కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ ఫోన్ కేవలం లగ్జరీ వస్తువుగా భావించేవారు. నేడు అది ఇంద్రజాలంగా ఇంటర్నెట్ అనుసంధానంతో యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు అన్వేషించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు ఎక్కడకు వెళ్లాలన్న దీనిలో ఉండే జిపిఆర్ఎస్ ద్వారా తెలుసుకొని సరైన అడ్రస్ కు ఒకరితో పని లేకుండా చేరుకుంటున్నారు. చిన్నపిల్లలకు వారి తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి మురిసిపోతుంటారు. అయితే ఈ ఫోన్లు వారి పిల్లలు చూడటం వలన వారికి భవిష్యత్తులో వచ్చే మానసిక రోగాల గురించి ఆలోచించకపోవడం చాలా శోచనీయం.
ప్రతి 100 మందికి చిన్నారులలో ఒకరు రోగాలతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తూన్నా తల్లిదండ్రులు మాత్రం వారి హెచ్చరికలు పట్టించుకోకుండా వారి పిల్లలు అస్వస్థతకు గురైనప్పుడు ఆసుపత్రుల చుట్టూ పరిగెత్తడం పరిపాటిగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ల వినియోగంవలన చిన్నారుల యువతపై వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సహజంగా ఉండే రక్త సంబంధాలు వీటి వలన దూరం అవుతున్నాయి. ఈ ఫోన్లు ఉంటే చాలు తమ ముందు అందరూ బలాదూర్.. అనే విష బీజం యువతలో నాటుకు పోయింది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవడం, ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్ల వైపే తమ దృష్టి ఉండడంతో రక్త సంబంధాలు కుంటుపడుతున్నాయి. ఇంటికి అతిధులు వచ్చిన వారితో మాట్లాడకపోవడం వలన చాలా సంబంధాలు ముందుకు సాగడం లేదు. తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నది తల్లిదండ్రులే.. చిన్నారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. తమ పనికి ఆటంకం కలిగించారనే ప్రధాన ఉద్దేశంతో అభం శుభం ఎరగని చిన్నారుల చేతిలో స్మార్ట్ ఫోన్లు పెడుతున్న తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కాలక్రమంలో పిల్లలకు వ్యసనంగా మారి చేతిలో ఫోన్ ఉంటే గాని... ఏ పని చేయలేని స్థితికి వారు అలవాటు పడటం జరిగింది. పిల్లలపై ఈ ఫోన్ల ప్రభావం చాలా చెడుగా చూపెడుతుందని. ఇలాంటి స్థితిని తల్లితండ్రులు తెలుసుకో లేకపోతున్నారని, పిల్లల ఎదుగుదలపై వీటి ప్రభావం బాగా పడుతుందని అర్థం చేసుకోవాలి. చుట్టుప్రక్కల పరిసరాలు వాతావరణాన్ని గమనించకుండా వారు ఫోన్లలో లీనమైపోతుంటే వారికి మాటలు కూడా త్వరగా రావడం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.