-Advertisement-

SHG: ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం సుస్థిరాభివృద్ధికి చిరునామా..

Health tips telugu Health benefits news Daily trending news Telugu Intresting news Daily news updates Breaking news updates Telugu short news Job news
Peoples Motivation

ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం సుస్థిరాభివృద్ధికి చిరునామా: జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, జూలై 02 (పీపుల్స్ మోటివేషన్):-

ఓర్వకల్లు మండలంలోని ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం సుస్థిరాభివృద్ధికి చిరునామా అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

మంగళవారం ఓర్వకల్లు మండలంలోని బాలభారతి పాఠశాల మైదానంలో ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం రజతోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు చదువుకుంటే ఆ కుటుంబం పైకి వస్తుంది అదే ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లే కాదు సమాజంలో ఉన్న వాళ్ళందరూ పైకి వస్తారనే విషయాన్ని ఇక్కడున్న పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం మహిళలు చేసి చూపించారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. 

1995 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో స్వయం సహాయక సంఘాల గురించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఉండేదని దాని జవాబు ఓర్వకల్లు మండలముగా మేము గుర్తుపెట్టుకునే వాళ్ళమని కలెక్టర్ తెలిపారు. 

Self-help groups Orvakal Kurnool district meeting district collector Ranjith Basha, PANYAM MLA GOWRU CHARITHA REDDY
దాదాపు 30 సంవత్సరాలు పాటు కేవలం ఒక మండలానికో ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఇండియా దేశానికే కాకుండా దేశ దేశాలకు కూడా ఒక మోడల్ గా నిలిచినటువంటి మీకందరికీ ఒక హాట్సాఫ్ అన్నారు.. 

పేదరిక నిర్మూలన అన్నది ఇప్పటికీ, ఎప్పటికీ చాలా కష్టమైన పని అని, ఒకరికి ఆర్థికంగా సాయం చేయొచ్చు, చదువుపరంగా సాయం చేయొచ్చు కానీ వాళ్లని స్వంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్లంతకి వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా జీవించేటువంటి పేదరికం నుంచి బయట తీసుకురావడం అన్నది అత్యంత కష్టమైనటువంటి పని అయినప్పటికీ మహిళలు ఇక్కడ మొదలుపెట్టిన ఉద్యమం ద్వారా ఇతరుల మీద ఆధారపడకుండా స్వంత కాళ్ళ మీద జీవించి పేదరికం నుండి బయటకు రావచ్చు అనే విషయాన్ని మొత్తం ప్రపంచానికే ఇక్కడున్న మహిళలు తెలియచెప్పారన్నారు. కాబట్టి మీరందరూ ఈరోజు విజయవంతమైన మహిళలు, గ్రూప్ లుగా ఉన్నారన్నారు. 

1995 సంవత్సరంలో రోజుకొక రూపాయి పొదుపు చేస్తే, భవిష్యత్తు లో ఆ పొదుపు అన్నది ఎక్కడికో వెళ్తుందనే విషయాన్ని మాకు చెప్పే వాళ్ళన్నారు. ఇప్పుడు ప్రతి గ్రూపులో ప్రతి మెంబర్ నెలకు దాదాపు 1000 రూపాయలు పొదుపు చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్ గా మీరందరూ పేదరికం నుంచి బయటకు వచ్చినట్టే మీ కుటుంబాలన్నీ స్వశక్తిగా నిలబడుతున్నట్లే అన్నారు.  

 ఓర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘంకి సంబంధించి ఇచ్చిన ప్రజెంటేషన్లో ఒక ప్రభుత్వం ఏం చేయగలదో లేదంటే ఒక ప్రభుత్వం నుండి ప్రజలు ఏం ఆశిస్తారో అవన్నీ కూడా మీ ఐక్య సంఘం వాళ్ళు చేసి చూపించారన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 10 లక్షల రూపాయలు డొనేట్ చేసినట్టు ఉండడంతో పాటు కోవిడ్ సమయంలో చేసిన ప్రజాసేవ గాని లేదంటే 2009 సంవత్సరంలో వరదలు వచ్చిన సమయంలో డొనేట్ చేసిన 10 లక్షల రూపాయలు గాని ఈ విధంగా మీరు మీ స్వంత కాళ్ళ మీద మీరు నిలబడడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్జిఓ చారిటీ లు ఏ విధంగా ఐతే ప్రజాసేవ కోసం పని చేస్తున్నాయో అదే విధంగా మీరు కూడా ప్రజాసేవ చేసి ఇతరులకు సహాయం చేసే స్టేజ్ కి వచ్చారంటే ఈ 30 సంవత్సరాల్లో ఇక్కడున్నటువంటి మహిళలు ఈ సక్సెస్ కి కారణమన్నారు. 15 లేదంటే 20 రూపాయలకు పనిచేసి రోజుల నుండి ఈరోజు ఈ స్థితికి చేరుకున్నారంటే ఇది మహిళల నిరంతర కృషి అన్నారు. మరొకసారి ఇక్కడున్న మహిళలందరికీ కలెక్టర్ అభినందనలు తెలియచేశారు..   

అంతే కాకుండా మీరు ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని, ఒక సిస్టంను ఎస్టాబ్లిష్ చేసుకొని, సొంతంగా ఇక్కడ స్కూల్ కట్టుకోవడం మీ పిల్లలను ఇక్కడే మీరు చదివించుకోవడం, వాళ్ళని ఉద్యోగులుగా పంపించడం మరల వారి నుండి సొసైటీ కి ఉపయోగపడే విధంగా చేసుకోవడమనేది సుస్థిరాభివృద్ధికి చిరునామాగా ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం ని తీసుకోవచునన్నారు. మహిళలందరూ కూడా ఈ విజయాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని, మీరందరూ మరింత పైకి ఎదిగి మీ చుట్టుపక్కలందరికి కూడా సాయం చేయాలన్నారు. 

ఓర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘంకి సంబంధించి ఇచ్చిన ప్రజెంటేషన్ లో 2030 నాటికి పేదరికం అనేది లేకుండా ఉన్నటువంటి మండలంగా తయారు చేస్తామనే ప్రతిజ్ఞ మీరు చేసుకున్నారని, ఖచ్చితంగా మీరందరూ అనుకున్న లక్ష్యానికి చేరుతారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా తన దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.. 

పాణ్యం ఎంఎల్ఏ గౌరు చరిత మాట్లాడుతూ... 1995 వ సంవత్సరంలో డ్వాక్రా సంఘాలలో పొదుపు ఉద్యమం మొదలు పెట్టిందే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారన్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్వకల్లు మండలం ఉండడం ఇప్పుడు ఓర్వకల్లు మండలం ఇంతకీ ఇంతింతై పెరిగి ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నారంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆరోజులలో రోజుకు ఒక్క రూపాయి పొదుపు చేయండి నెలకు 30 రూపాయలు పొదుపు చేస్తే చాలు అనే రోజుల నుండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు పొదుపు చేసుకుంటున్నామన్న విషయాన్ని గ్రామ గ్రామాన తిరిగిన సమయంలో చెబుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు.మీ కుటుంబంలో పిల్లలను బాగా చదివించుకోవడమే కాక, ఆర్థికంగా చాలా బాగా పైకి వచ్చారని, ఈరోజు మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం అంటే ఓర్వకల్లు మండలం చాలా గర్వించదగ్గ విషయమని దీని వెనక ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి గారి కృషి ఎంతో ఉందన్నారు. ఆ రోజులలో పొదుపులో చేరడానికి ఎవ్వరూ ముందుకు రాని సమయంలో మహిళలందర్ని చైతన్యం పరిచి పొదుపులో చేరండి మీ జీవితాలు బాగుపడతాయని గ్రూపులో చేర్చుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. అంతే కాకుండా మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకి వెళ్లి మహిళలు సీఆర్పీలుగా పనిచేసి ఒక్కొక్కరు లక్ష రూపాయల వరకు సంపాదించుకున్న రోజులు కూడా ఉన్నాయన్నారు.

మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకోని వస్తున్నారన్నారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి హామీ ఇవ్వడం జరిగిందని, రానున్న రోజులలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రాబోతుందని అంతేకాకుండా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నారన్నారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న వాళ్లకు అందరికీ నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. 

పొదుపు ఉద్యమం ద్వారా అంచలు అంచలుగా ఎదిగారని, ఇదే విధంగా ఇంకా ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. మహిళలు అనుకుంటే సాధించగలిగేదంటూ ఏదీ లేదని మహిళల్లో పట్టుదల, ఓర్పు చాలా ఎక్కువ ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా దాన్ని సాధించేంతవరకు వదలరన్నారు. ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం వారు బాలభారతి స్కూల్ కట్టడం చాలా అభినందించదగ్గ విషయమని, ఇది కార్పొరేట్ స్కూల్ కు దీటుగా ఉందన్నారు.   

తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘo అధ్యక్షురాలు విజయ భారతి 30 ఏళ్లుగా పొదుపు గ్రూపుల్లో సాధించిన ప్రగతి గురించి వివరించారు..  

కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సలీం భాష, ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి, ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మీ ఐక్య సంఘo సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-