Refrigerator: ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను ఉంచకూడదు తెలుసా...!
Refrigerator: ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను ఉంచకూడదు తెలుసా...!
ఈ పదార్థాలను ఫ్రిజ్లో పెడుతున్నారా..
ఫ్రిజ్లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయి..
ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లో పెడుతాం.
ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఫ్రిజ్ ఉంటుంది. అయితే ఫ్రిజ్ను ఉపయోగించే సమయంలో తెలిసో తెలియకో మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. మరీ ముఖ్యంగా ఎండకాలంలో బయట ఏ ఆహారాన్ని ఉంచినా త్వరగా పాడైపోతాయి. దీంతో వాటిని ఫ్రిజ్లో పెట్టేస్తాం. అందులో పెడితే ఫ్రెష్గా ఉంటాయని భావిస్తాం. అయితే.. ఫ్రిజ్లోని చల్లదనం వల్ల ఆయా ఆహార పదార్థాలు పోషకాలు కోల్పోతాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పదార్థాలైతే తమ స్వభావాన్ని కోల్పోవడమే కాదు.. విషంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్లో ఏయే ఆహార పదార్థాలను ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లు
అరటి పండ్లు చాలా మంది అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లో పెడుతుంటారు. అయితే.. అరటి పండ్లు ఫ్రిజ్ లో పెట్టడం వల్ల నల్లగా మారుతాయి. అంతే కాదు.. వాటి చుట్టూ ఉంచిన పండ్లు, కూరగాయలు కూడా పాడవుతాయి. ఇథిలీన్ అనే వాయువు వల్ల ఇది జరుగుతుంది. అందుకే అరటి పండ్లను ఎప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచాలి.
ఉల్లిపాయ-టమోటా
ఇతర కూరగాయల్లాగే.. మీరు కూడా ఉల్లిపాయలు, టొమాటోలను రిఫ్రిజిరేటర్లో పెడితే ఆపేయండి. ఎందుకంటే.. వాటి ఆకృతి త్వరగా పాడవడమే కాకుండా, ఫ్రిజ్ వాటి లోపల తేమను గ్రహిస్తుంది. విటమిన్-సి తగ్గిపోయి.. రుచిని సైతం కోల్పోతుంది.
బ్రెడ్
బ్రెడ్ లేదా దాని ఉత్పత్తులను రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు. వీటిలో ఉండే ఈస్ట్ చల్లదనానికి పాడైపోవడం మొదలవుతుంది. ఈ క్రమంలో.. ఫ్రిజ్ లో ఉంచిన బ్రెడ్ తిన్నట్లైతే.. జీర్ణక్రియ దెబ్బతింటుంది.
ఊరగాయ
చాలా మంది ఫ్రిజ్లో ఊరగాయలను ఉంచుతాతారు. అలా చేయడం వల్ల అది ఫంగస్ ఏర్పడుతుంది. దీంతో.. అందులో ఉచిన వస్తువులను కూడా పాడుచేస్తుంది. ఫ్రిజ్లో ఉంచిన ఇతర వస్తువులలో దాని వాసన పోయి.. మిగతా వాటిని నాశనం చేస్తుంది.
బంగాళదుంప
బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్లో ఉంచినప్పుడు వాటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుంది. అంతేకాకుండా.. గట్టిగా మారుతుంది. సులభంగా కట్ చేయడానికి రాదు. దీంతో.. బంగాళదుంప రుచి పోతుంది. బంగాళాదుంపలు