-Advertisement-

Ration Cards: సర్కార్ గుడ్ న్యూస్ ..రేషన్ కార్డులో సవరణలపై గ్రీన్ సిగ్నల్..

General news Telugu daily News Interesting news Daily Telugu news Breaking news Breaking news Telugu daily updates latest telugu news ration Cards
Pavani

Ration Cards: సర్కార్ గుడ్ న్యూస్ ..రేషన్ కార్డులో సవరణలపై గ్రీన్ సిగ్నల్..

  • తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
  • రేషన్ కార్డులకు సంబంధించిన మార్పులు చేర్పులకు అవకాశం..

 
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులకు సంబంధించిన మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. నిన్నటి నుంచి (శనివారం) సవరణ ఎంపిక ప్రారంభించింది. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా కసరత్తు చేస్తోంది. త్వరలో అర్హులకు కొత్త రేషన్కార్డులు అందజేస్తామన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవాలనుకునే వారు మీ సేవా కేంద్రాల్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రేషన్కార్డుల్లో పేరు మార్పులతో పాటు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారు కూడా నమోదు చేసుకోవచ్చు. మార్పులు, సవరణల కోసం, మీ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తును సమర్పించండి. వివరాలను పరిశీలించిన తర్వాత రేషన్కా ర్డుల్లో మార్పులు చేయనున్నారు. కాగా.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందేందుకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి త్వరలోనే కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది.  
General news Telugu daily News Interesting news Daily Telugu news Breaking news Breaking news Telugu daily updates latest telugu news ration Cards

ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తుండగా ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది. పాత కార్డుల స్థానంలో కొత్త రూపంలో కార్డులు అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. మరో 10 లక్షల కుటుంబాల నుంచి కొత్త వాటి కోసం దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాతే కొత్త కార్డుల మంజూరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల విషయమై త్వరలో తాజా సమాచారం.. ప్రజాపరిపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తెల్లకాగితంపై రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరచాలని వారు దరఖాస్తులు కూడా సమర్పించారు. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటే మీ సేవ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.

Comments

-Advertisement-