Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్..!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి భారతీయ రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పుడు ఆ పోస్టులను భారీగా పెంచుతూ మరో ప్రకటన విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఉన్న ఖాళీల దృష్ట్యా మొత్తంగా 18,799 ఏఎల్‌పీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆర్ఆర్బీ భోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఈ దీనికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు అప్పటివరకు ఏమైనా సందేహాలు ఉంటే తమ అధికారిక వెబ్‌సైట్‌ను https://indianrailways.gov.in/ చూడాలని కోరింది.
అయితే ఈ పోస్టులకు ప్రకటన అనంతరం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.