Puri: జగన్నాథ ఆలయంలో రాజకోట రహస్యం..ఎన్నో విశేషాలకు నిలయం పూరీక్షేత్రం
Puri: జగన్నాథ ఆలయంలో రాజకోట రహస్యం..ఎన్నో విశేషాలకు నిలయం పూరీక్షేత్రం
భువనేశ్వర్, జూలై 18 (పీపుల్స్ మోటివేషన్):-
భారతీయ సంస్కృతిలో అదో అద్భుతం. అలాంటి పుణ్యక్షేత్రం ఇప్పుడు అపూర్వమైన భాండాగారాంతో ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తోంది. రత్నభాండాగారాన్ని తెరిచి, రహస్య ప్రదేశాలకు తరలించారు. ఇందులో సొమ్ము ఎంతటి విలువ కలిగి ఉందో అన్నది చర్చగా మారింది. నిజానికి పూరీ క్షేత్రం అంతా అద్భుతమే. పౌరాణిక- చారిత్రిక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం. పూరీ. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒకానొక దివ్యయాత్రా ధామం. అక్కడ విగ్రహం నుంచి ప్రసాదం వరకూ అంతా విశిష్టమే. ఆషాడ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర మహిమ కూడా అలాంటిదే. మన సంస్కృతీ- సంప్రదాయాల కూ ఇక్కడి యాత్రకూ సంబంధమేంటి? జగన్నాథుడు దేవేరులతో కాక సోదర సోదరీ మణులతో దర్శనమిస్తాడు. ఎందుకు.. వైష్ణవాలయాల్లో పూరీ జగన్నాథ్ కి విశిష్ట స్తానముంది. ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందు కుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్ ధామ్ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది. జగన్నాథ రథయాత్ర విశేషాల సమాహారం. అందులో ప్రతిదానికీ ఓ వైశిష్ట్యం వుంది. రథయాతల్రో జగన్నాథుని రథాన్ని 'నందిఘోష్' గా వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి పదహారు చక్రాలుంటాయి. బలభద్రుడి రథాన్ని 'తాళ్ ధ్వజ్' పేరుతో పిలుస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీన్ని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. తాళ ధ్వజ్ కు 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని 'దర్ప దళన' అంటారు. ఈ రథానికి 12 చక్రాలుంటాయి. జగన్నాథుడు ఎన్ని ఆటంకాలనైనా దాటుకుని తన భక్తజనాన్ని కలుసుకోడానికి పెద్ద పెద్ద చక్రాలను రథానికి పూన్చుకుని అంగరంగ వైభవంగా వస్తాడు. అందుకే వాటికి 'జగన్నాథ రథచక్రాల్' అన్న పేరొచ్చింది. పూరీ జగన్నాథ ఆలయ గోపురపు అంచు మీద.. సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. ఇది నారాయణ రూపంలో నాలుగోది. దీనిపై ఒక పసుపు జెండా ఎగురుతూ కనిపిస్తుంది. దీనిలోని ఎరుపు గుర్తు జగాన్నాథుడు ఆలయంలోనే వున్నాడని సూచిస్తుందని భావిస్తారు. పూరీ ఎంతటి ప్రసిద్ధ క్షేత్రమంటే, ఇప్పటి వరకూ ప్రతి హైందవ మతాచార్యుడూ ఈ క్షేత్ర దర్శనం చేశారు. ఒక్క మాధవాచార్యులు తప్ప.. ఈ క్షేత్రాన్ని ప్రముఖ ఆచార్యులందరూ దర్శించారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు. అలాగే రామానుజాచార్య, నింబర్కాచార్యలతో పాటు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరీని సందర్శించి నప్పుడు.. ఇక్కడ తన భైరకాన్ని ఏర్పరుచుకున్నారు. గురునానక్, కబీర్, తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించిన ఆధారాలున్నాయి. ఇలాంటి విశేషాలకు తోడు ఇప్పుడు రత్నభాండాగారం తోడయ్యింది. దానిని వెలికితీస్తే కోట్ల రూపాయల సంపద బయటకు వస్తుంది.