PSTU: తెలుగు యూనివర్సిటీలో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
PSTU: తెలుగు యూనివర్సిటీలో పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ... 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కేవలం తెలంగాణకే ప్రవేశాలను పరిమితం చేస్తూ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరీక్ష ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలు ఉంటాయి.
తెలుగు విశ్వవిద్యాలయము హైద్రాబాద్ TELUGU UNIVERSITY
ప్రవేశాల నోటిఫికేషన్ ద్వారా తెలుగు వర్సిటీలో రెగ్యులర్ కోర్సులైన శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర అంశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆనలైన్లో దరఖాస్తు చేయాలి. ఆగస్టు 9 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు.
కోర్సుల వివరాలు:
- బీఎస్ఏ (నాలుగేళ్లు), బీడిజైన్ (నాలుగేళ్లు)
- ఎంఎస్ఏ (రెండేళ్లు), ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ (రెండేళ్లు), ఎంఏ/ ఎంపీఏ (రెండేళ్లు), ఎంఏ (చరిత్ర, సంస్కృతి, పర్యాటకం) (రెండేళ్లు), ఎండిజైన్ (రెండేళ్లు)
- పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
- డిప్లొమా ప్రోగ్రామ్
- సర్టిఫికెట్ ప్రోగ్రామ్
అర్హత:
కోర్సును అనుసరించి ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 09-08-2024.
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 19-08-2024.