-Advertisement-

Pawan Kalyan: సమాజ హితం కోసం డిప్యూటీ సీఎం సూర్యారాధన

Daily news Telugu intresting facts daily political updates in Telugu breaking news Telugu ssc jobs govt jobs current affairs in Telugu latest crime ne
Priya

Pawan Kalyan: సమాజ హితం కోసం డిప్యూటీ సీఎం సూర్యారాధన

సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్న పవన్ కళ్యాణ్

నిత్యం సూర్య నమస్కారాలు చేసే పవన్ కళ్యాణ్

వెన్ను సంబంధిత ఇబ్బందితో కొద్ది కాలంగా సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కావడం లేదు

అందుకు ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించిన మంత్ర సహిత ఆరాధన

Daily news Telugu intresting facts daily political updates in Telugu breaking news Telugu ssc jobs govt jobs current affairs in Telugu latest crime ne

Pawan Kalyan Surya Aradhana Deeksha: విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికి ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ 'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్' అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధాన ఆచరిస్తున్నారని ఆయన టీం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు, ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు.

దీక్షా బద్ధుడైన పవన్ కళ్యాణ్ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రకరణం గావించారు. పవన్ కళ్యాణ్ నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు కానీ వెన్ను సంబంధిత ఇబ్బందితో కొద్ది కాలంగా సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కావడం లేదు. అందుకు ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించిన మంత్ర సహిత ఆరాధనను నిర్వర్తించారని తెలుస్తోంది. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయింది కానీ మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉంది. రవి వారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారు, అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా అనవచ్చని వేద పండితులు తెలిపారు. వారాహి దీక్ష, సూర్యారాధనలు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

Comments

-Advertisement-