Olympics 2024: ఈ విషయం తెలుసా.. ఒలింపిక్స్ లో ఒక అథ్లెట్ కు దాదాపు 14 కండోమ్ ల జారీ ఎందుకు..?
Olympics 2024: ఈ విషయం తెలుసా.. ఒలింపిక్స్ లో ఒక అథ్లెట్ కు దాదాపు 14 కండోమ్ ల జారీ ఎందుకు..?
- క్రీడల్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు
- 200 కంటే ఎక్కువ దేశాలకు చెందిన క్రీడాకారులు
- 2 లక్షలకు పైగా కండోమ్ లను పంపిణీ చేయనున్న ఒలంపిక్స్ సంఘం
- ఒక అథ్లెట్ కు దాదాపు 14 కండోమ్ జారీ
అంగరంగ వైభవంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. వివిధ క్రీడలకు చెందిన 10 వేల మందికి పైగా అథ్లెట్లు పారిస్ లో తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. 200 కంటే ఎక్కువ దేశాలకు చెందిన క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. అందుకే పారిస్ లొ ని క్రీడాకారులకు ఒలింపిక్ సంఘం.. 2 లక్షలకు పైగా కండోమ్ లను పంపిణీ చేస్తుంది. ఇందులో ప్రతి అథ్లెట్ కు దాదాపు 14 కండోమ్ లు అందజేయనున్నారు. అంతే కాదు క్రీడాకారులకు ప్రత్యేకమైన కిట్ ను కూడా అందజేస్తున్నారు. అందులో కండోమ్ లతో పాటు, ఇది సాన్నిహిత్యం కోసం విభిన్న విషయాలను కూడా కలిగి ఉంటుంది.
యాంటీ సెక్స్ బెడ్స్ అంటే..!
గత టోక్యో ఒలింపిక్స్ లో కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా.. అథ్లెట్ల సాన్నిహిత్యంపై అనేక ఆంక్షలు విధించబడ్డాయి. అయితే.. పారిస్ ఒలింపిక్స్ లో అలాంటి పరిమితి లేదు. ఈ కారణంగానే క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలను ఒలింపిక్ సంఘం చూసుకుంటోంది. దీనితో పాటు.. పారిస్ ఒలింపిక్స్ కోసం యాంటీ సెక్స్ బెడ్లను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ అంటే క్రీడా సంగ్రామంలో సౌకర్యాలపై చర్చ మొదలవడం సాధారణం. గతంలోలాగే ఈసారీ అథ్లెట్లకు కేటాయించిన బెడ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న బెడ్లు అంటే.. 'యాంటీ సెక్స్ బెడ్స్' ఏర్పాటు చేశారన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి పారిస్ ఒలింపిక్స్ లోని క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ప్రత్యేక రకం బెడ్ ను సిద్ధం చేశారు. ఈ రకమైన మంచం అథ్లెట్లు నిద్రించడానికి మాత్రమే ఉంటుంది. అంటే ఆ మంచం మీద ఒక్కరే పడుకోగలరు. అందుకే దీనికి యాంటీ సెక్స్ బెడ్ అని పేరు పెట్టారు.