-Advertisement-

OAMDC 2024 : డిగ్రీ కోర్సుల అడ్మిషన్లు...డిగ్రీ కోర్సుల్లో మార్పులు..

Degree oamdc seat allotment Degree oamdc login Degree oamdc eligibility OAMDC 2024-25 Oamdc 2025 Degree oamdc 2021 www.oamdc.ap.gov.in seat allotment
Priya

OAMDC 2024 : డిగ్రీ కోర్సుల అడ్మిషన్లు...డిగ్రీ కోర్సుల్లో మార్పులు..

ఒకప్పుడు డిగ్రీ చేస్తే గొప్పగా చెప్పుకునేవారు. కాలక్రమంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గి ఇంజినీరింగ్ కోర్సుల వైపు యువత మొగ్గుచూపారు. ఇంజినీరింగ్ కోర్సులు చేస్తే ఏదొక ఉద్యోగం వస్తుందనే నమ్మకం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు డిమాండ్తో డిగ్రీ కోర్సుల్లో చేరేవారు తగ్గిపోయారు. ఇప్పుడు డిగ్రీలో కూడా కొత్త కోర్సులను ప్రవేశపెట్టి డిగ్రీ కోర్సులతో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. 

Degree oamdc seat allotment Degree oamdc login Degree oamdc eligibility OAMDC 2024-25 Oamdc 2025 Degree oamdc 2021 www.oamdc.ap.gov.in seat allotment

నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో వినూత్న కోర్సులు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుండడంతో విద్యార్థులు ఈ కోర్సుల వైపు అడుగులు వేయవచ్చు.

అందుబాటులోకి ఆనర్స్ డిగ్రీ

సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మార్పులు వచ్చాయి. ఇంజినీరింగ్కు ధీటుగా మార్పులు చేశారు. మూడేళ్ల కాలానికి సాధారణ డిగ్రీ, నాలుగేళ్లకు ఆనర్స్ డిగ్రీ సర్టిఫికెట్లు అందుబాటులోకి వచ్చాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేసి, ఉపాధికి బాటలు వేసేలా కోర్సులను రూపొందించారు. ఈ కోర్సుల్లో భాష, సాంకేతిక నైపుణ్యాలతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంచేలా ఇంటర్న్షిప్, పారిశ్రామిక శిక్షణను అంతర్భాగం చేశారు. ఇవి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు వరంగా మారాయి.

సెమిస్టర్ విధానంతో పర్యవేక్షణ

ప్రభుత్వ కళాశాలల్లోనూ డిగ్రీ కోర్సులు ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా డిగ్రీలో అదే మాధ్యమాన్ని కొనసాగించవచ్చు. ఆ భాషా నైపుణ్యంతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని కార్పొరేట్ కొలువులు సాధించే స్థాయికి చేరుకోవచ్చని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. సెమిస్టర్ విధానం అమలులోకి రావడం, పరీక్షలు, మూల్యాంకనం ద్వారా విద్యార్థి అభ్యసన స్థాయిని ఎప్పటికప్పుడు అధ్యాపకులు పర్యవేక్షించడం వల్ల విద్యార్థులు ఉత్తమ అవకాశాలను అందుకోగలుగుతారు.

కంప్యూటర్ కోర్సులతో కొత్త పుంతలు

డిగ్రీలో కంప్యూటర్ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టడంతో డిగ్రీ చదువులు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సంప్రదాయ కోర్సులతో పాటు కంప్యూటర్ ఆధారిత కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కోర్సుల్లో చేరి విజయవంతంగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే మూడేళ్లకే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

డిగ్రీ కోర్సుల్లో మార్పులు

1. సంప్రదాయ కోర్సులైన బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. పీజీలోలా పూర్తిగా ఒక సబ్జెక్టు చదివేలా డిగ్రీ కరిక్యులమ్తోపాటు సిలబస్లో మార్పులు చేశారు.

2. బీఎస్సీ లైఫ్సెన్సెస్లో బోటనీ, జువాలజీ, ఆక్వా కల్చర్, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హోమ్ సైన్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్సులతో పాటు బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్న్స్ వంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చారు.

3. బీఏలో ఫైనాన్షియల్ ఎకనామిక్స్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరరీ స్టడీస్, తెలుగు భాష- సాహిత్యం, పొలిటికల్ సైన్స్ కోర్సులను తెచ్చారు.

4. బీకాంలో జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్–ఇన్స్యూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీబీఏ రిటైల్ ఆపరేషనన్స్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

Comments

-Advertisement-