కలెక్టర్ జి.రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసిన MP Dr. బైరెడ్డి శబరి.
కలెక్టర్ జి.రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసిన MP Dr. బైరెడ్డి శబరి.
నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారిని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు Dr. బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిచారు.
జిల్లా రైతులకు పంటలు సాగుచేసుకునేందుకు సాగునీరు అందించాలని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమస్య లేకుండా చూడాలని MP శబరి జిల్లా కలెక్టర్ రాజకుమారిని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో MP శబరి విలేకరులతో మాట్లాడుతూ గత ఇదేళ్ళ వైసీపీ పాలనలో జిల్లాలోని కేసి కెనాల్, తెలుగుగంగా, ఎస్ ఆర్ బి సి ఆయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు అందించక అనేక కష్టాలు పడ్డారని, పంటలు ఎండిపోయిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతులకు సాగునీరు ఇవ్వలేం అంటూ అధికారుల ద్వారా రైతులకు నోటీసులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కిందని శబరి విమర్శించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారుల సహాకారం ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరహరి విశ్వనాధ్ రెడ్డి తదితరులు ఉన్నారు.