High BP: అధిక రక్తపోటుకు కారణం అదేనా నిర్లక్ష్యం చేస్తున్నా జనాభా
High BP: అధిక రక్తపోటుకు కారణం అదేనా నిర్లక్ష్యం చేస్తున్నా జనాభా
మనదేశంలో ముప్పై శాతం జనాభాకు అధిక రక్తపోటు..
" తమకు సమస్య ఉందని గుర్తించని సగం మంది ప్రజలు..
అధికరక్తపోటుతో చాలా ప్రమాదం..
మనదేశంలో ముప్పై శాతం జనాభా అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మంది ప్రజలకు తమకు అధిక రక్తపోటు ఉన్నట్టు తెలియదు. తెలిసిన వారిలో దాదాపు సగం మంది ప్రజలకు చికిత్స సరిపడా తీసుకోక పోవడం వల్ల అది అదుపులోకి రావడం లేదు. మారుతున్న ఆహారపు అలవాట్లతో దేశంలోని యువత ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిపోతున్నారు. టేస్టీగా ఉండే జంక్ ఫుడ్ తెలియకుండానే సైలెంట్ కిల్లర్ లా తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. అధిక రక్తపోటు అనేది గుండె, నరాలు, మూత్రపిండాలు, ఇతర ముఖ్యమైన అవయవాలను కాలక్రమేణా దెబ్బతీసే పరిస్థితి. వైద్యులు దీనిని తరచుగా 'సైలెంట్ కిల్లర్' అని పిలుస్తారు, ఎందుకంటే శరీరానికి గణనీయమైన నష్టం జరిగే వరకు నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి అధిక రక్తపోటుకు ప్రధాన కారణమని వైద్యలు చెబుతున్నారు.
అధిక రక్తపోటు జాబితాలో యువకులు కూడా ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. అధిక రక్తపోటును ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. లక్షణాలు లేకపోయినా, సాధారణ ఆరోగ్య పరీక్షల ద్వారా అధిక రక్తపోటు స్థాయిలను ముందుగానే గుర్తించవచ్చు. ముఖ్యంగా యువకులు తమ రక్తపోటును పర్యవేక్షించడంలో జాగ్రత్తగా ఉండాలి. హై బీపీని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే, అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. సుదీర్ఘమైన అధిక రక్తపోటు సిరలు గట్టిగా, మందంగా మారడానికి కారణమవుతుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితికి దారితీస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా కళ్లకు సమస్యలను తీసుకువస్తుంది. శాశ్వతంగా గుడ్డి వాళ్లుగా మారే అవకాశం కూడా ఉంది.