Hepatitis: ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
Hepatitis: ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం
కాలేయ వ్యాధులకు దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ, జూలై 27 (పీపుల్స్ మోటినేషన్):-
ప్రస్తుతం కాలంలో ఉన్న పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేనితనం తదితర కారణాలతో మనిషి ఎన్నో వ్యాధుల బారిన పడుతున్నాడు. ఇందులో హెపటైటీస్ వ్యాధి. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలోని కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏ,బి,సి,డి,ఇ లు వెలుగు చూసిన ఈ వ్యాధిలో హెపటైటీస్ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి తీవ్రత సిర్రోసిస్ దశకు చేరుకుని ఏకంగా కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ దశలో కాలేయం మార్పిడి చేయాల్సి వస్తుంది. అందుకు. వ్యాధి బారినపడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే 2011లో జూలై 28వ తేదీని ప్రపంచ కాలేయ వ్యాధి (హెపటైటిస్) దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి ఈ రోజున సదస్సులు నిర్వహించడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. దీంతో ప్రతియేటా జూలై 28న ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము. హెపటైటిస్ బి వైరస్ ను కనుగొన్న నోబెల్ గ్రహీత బరూచ్ శామ్యూల్ బ్లంబర్గ్ కు గుర్తుగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజును ఏర్పాటు చేశారు. కాలేయ వ్యాధి ఎక్కువగా ఎవరికి వస్తుంది. ఈ వ్యాధి అధికంగా మద్యం సేవించే వారికి వస్తున్నట్లు తెలుస్తోంది. శరీరంలో చేద మద్యాన్ని విసర్జించే క్రమంలో కాలేయం ఎక్కువగా శ్రమకు గురవుతుంది. కాలేయం సామర్థ్యానికి మించి మద్యం సేవించినట్లయితే కాలేయ మెల్లమెల్లగా దెబ్బతింటుంది. ఫలితంగా ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ డిసీజ్. ఆల్కహాలిక్ హెపటైటీస్ ఆల్కహాలిక్ సిర్రోసిస్ వ్యాధులు దరిచేరుతాయి. ఆల్బహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో కాలేయం కణాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే కాలేయం పనితీరు సక్రమంగా ఉన్నా.. ఎంజైమ్ విడుదలలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఈ పరిస్థితిని మధ్యం మానేసి సరిదిద్దుకోవాలి. అతిగా మధ్యం సేవించే వారి కాలేయం వాపునకు గురై గట్టిగా తయారవుతుంది. దీనినే ఆల్కహాలిక్ హెపటైటీస్ అంటారు. ఈ వ్యాధితో కాలేయం పనితీరు క్రమంగా అదుపు తప్పుతుంది. వ్యాధి తీవ్రత పెరిగితే కాలేయం విఫలమవుతుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, వైరస్ ల వల్ల కాలేయం కేన్సర్కు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. లివర్ క్యాన్సర్ ముప్పు హెపటైటిస్ ఇన్ఫెక్షన్ లివర్ క్యాన్సర్ కు కూడా దారి తీసే అవకాశం ఉంది. సాధారణ కాలేయ క్యాన్సర్ ను హెపటో సెల్యూలార్ క్యాన్సర్ అని అంటారు. దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకునే వారికి ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీన్ని కడుపు పైభాగంలో నొప్పితో పాటు బరువు తగ్గడం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు. పసిరికలు, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ప్రాథమికంగా రక్తపరీక్ష (AFB), అల్ట్రా సౌండ్ పరీక్షలతో గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. 'వన్ లైఫ్, వన్ లివర్. ఈ సంవత్సరం 2024, ప్రపంచ హెపటైటిస్ డే థీమ్ "It's time for action" వైరల్ హెపటైటిస్ నివారణ, రోగనిర్ధారణ మరియు చికిత్సను మెరుగుపరచడానికి అవసరమైన కొలతలను వేగవంతం చేయడానికి, తద్వారా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా 2030 హెపటైటిస్ నిర్మూలన లక్ష్యాలను సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్నారు.