-Advertisement-

Group 2: అయోమయంలో గ్రూప్ 2 అభ్యర్థులు.. షెడ్యూల్డ్ ప్రకారం పరీక్షలు..!

TSPSC TSPSC Notification 2024 www.tspsc.gov.in results TSPSC upcoming notifications TSPSC Group 2 Notification TSPSC Group 4 TSPSC Group 4 Notificatio
Priya

Group 2: అయోమయంలో గ్రూప్ 2 అభ్యర్థులు.. షెడ్యూల్డ్ ప్రకారం పరీక్షలు..!

  • నిరుగ్యోగులను గందరగోళంలో పడేస్తున్న సర్కారు..
  • పోస్టుల పెంపు.. వాయిదా లేదని సంకేతాలు..
  • ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ అధికారుల ఆదేశాలు..!

TSPSC TSPSC Notification 2024 www.tspsc.gov.in results TSPSC upcoming notifications TSPSC Group 2 Notification TSPSC Group 4 TSPSC Group 4 Notificatio

రాష్ట్రంలో నిరుద్యోగులు అయోమయంలో ఉన్నట్టు కనిపిస్తుంది. గ్రూప్ 2 అభ్యర్థుల పరీక్షలు జరుగుతాయా లేదో అని అయోమయంలో ఉన్నట్టు తెలుస్తుంది. గ్రూప్‌ 2లో ఒక్క పోస్టు పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదని తెలుస్తున్నది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కొంతవరకు స్పష్టత ఇచ్చారు. నిరుద్యోగులు కోరుతున్నట్టు పరీక్షలు వాయిదా వేసే ఆలోచనా చేయడం లేదని తెలుస్తున్నది. షెడ్యూల్‌ ప్రకారమే ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నపత్రాలతోపాటు పరీక్షలకు నిర్వహణకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేస్తున్నట్టు టీజీపీఎస్సీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. గ్రూప్‌ 2లో 2,000 పోస్టుల సంఖ్యను పెంచుతామని గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని ఆ పార్టీ తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.

Comments

-Advertisement-