Garikapati Bindhu Madhav: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటాం..
Garikapati Bindhu Madhav: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటాం..
-కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన.. గరికపాటి బిందు మాధవ్ ఐపియస్..
• శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటాం.
• ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం.
• ఎక్కడైనా సమస్యలుంటే ప్రజలు పోలీసు యంత్రాంగానికి సమాచారం అందిస్తే సమస్యను బట్టి వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం.
కర్నూలు జులై 15 (పీపుల్స్ మోటివేషన్):-
మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన బిందుమాధవ్ ఐపియస్ ని కుటుంబ సమేతంగా పూరోహితులు ఆశీస్సులు అందజేశారు.
అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మిడియాతో జిల్లా ఎస్పీ మాట్లాడారు.
కర్నూలు జిల్లాఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కి, రాష్ట్ర డిజిపి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. మహిళల భద్రతకు, మహిళల పై జరిగే నేరాల పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 100 రోజుల కార్యచరణ ప్రణాళిక లో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరాలు మరియు దొంగతనాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సహాకారం , సమన్వయంతో కలిసి పని చేస్తామన్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్క బాధితుడికి తక్షణ పరిష్కారం అందేలా కృషి చేస్తాం. జిల్లా పోలీసులను అప్రమత్రం చేసి నేరాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తాం. సిసి కెమెరాల నిఘాను బలోపేతం చేస్తాం. జిల్లా పోలీసుశాఖ కు జిల్లా ప్రజలు మరియు మీడియా వారు తమ వంతు సహాకారం అందించాలని కోరుకుంటున్నామన్నారు.
గరికపాటి బిందు మాధవ్ ఐపియస్ గురించి…
2017 ఐపియస్ బ్యాచ్ కు చెందిన బిందు మాధవ్ గారి స్వస్ధలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయవాడకు చెందినవారు. ఐపియస్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మొదటిసారిగా ప్రకాశం జిల్లాలో గ్రేహౌండ్స్ లో విధులు నిర్వర్తించారు.
రంపచోడవరం నందు ఏఎస్పీగా , గుంటూరు సెబ్ జాయింట్ డైరెక్టర్ గా, పల్నాడు అదనపు ఎస్పీగా , ఎస్పీగా పదోన్నతి పొంది న తర్వాత గ్రేహౌండ్స్ లో, పల్నాడు జిల్లాలో ఎస్పీ గా పని చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, డిస్పీలు , సిఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్సైలు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.