Electricity bills: కరెంట్ బిల్లు చెల్లింపులూ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కుదరవ్..!
Electricity bills: కరెంట్ బిల్లు చెల్లింపులూ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కుదరవ్..!
ఫోన్ ప్పే, అమెజాన్ పే వంటి పేమెంట్స్ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి కుదరదు.
హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-
ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులు చేయడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలనూ నిలిపి వేయడమే కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు TGSPDCL విద్యుత్ బిల్లులు చెల్లింపులను వంటి ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఫోన్ పే, క్రెడ్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. దీనివల్ల ఆయా యాప్స్ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు వీలు పడదు. ఇప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలోనూ అదే జరిగింది.