-Advertisement-

DSC: ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయోచ్చు..వారికి హాల్ టికెట్లను మార్చి ఇస్తాం..!

TS DSC TG DSC TS TET AP TET tsdsc.aptonline.in TG TET AP DSC AP DSC NOTIFICATION TG DSC EXAM DATES TELANGANA DSC NOTIFICATION AP DSC NOTIFICATION News
Peoples Motivation

హైదరాబాద్, (పీపుల్స్ మోటివేషన్):-

రాష్ట్రవ్యాప్తంగా 18 నుంచి ఆన్లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉంటే...అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరుకావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారమిచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో.. మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలిచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశమిస్తామని తెలిపారు. వారికి హాల్టికెట్లు మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

హాల్ టికెట్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Comments

-Advertisement-