-Advertisement-

Chaddannam: ఇలా ఉంటే చద్దన్నం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Health News in Telugu Health tips in Telugu Health useful news health benifits health losses Advantages fermentation disadvantage fermentation losses
Janu

Chaddannam: ఇలా ఉంటే చద్దన్నం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! 

చాలామందికి చద్దన్నం అంటే ఇష్టముండదు. కొంద‌రైతే చ‌ద్దన్నం అనే మాట వింటేనే వాక్ అంటారు.

Health News in Telugu  Health tips in Telugu Health useful news health benifits health losses Advantages fermentation disadvantage fermentation losses
కానీ ఒక్కసారి చ‌ద్దన్నంవ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాలేంటో తెలుసుకున్నారంటే ఇకపై చ‌ద్దన్నం వ‌ద్దు అనే మాట మీ నోట రానే రాదు‌. రాత్రి మిగిలిన అన్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున తిన‌డ‌ం మాత్రమే కాదు.. రాత్రికి మిగలేలా అన్నం వండుకుని మ‌రీ ఉదయాన్నే చ‌ద్దన్నం తింటారు. చద్దన్నంలో అంత గొప్ప తనం ఏముంది అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం..

చద్దన్నంతో ఎన్ని లాభాలుంటాయో ఇటీవ‌ల‌ అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ అధ్యయ‌నంలో వెల్లడైంది. ఆ అధ్యయనం ప్రకారం.. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్‌, కాల్షియం లాంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. అందుకే చ‌ద్దన్నంలో ఆ పోష‌కాల పాళ్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి అది 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువ‌గా ల‌భిస్తాయి. అందుకే చ‌ద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్‌గా ఉంటుంది.

అంతేకాదు చద్దన్నంతో శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా ల‌భిస్తుంది. ఒంట్లో వేడి చేయడం కార‌ణంగా మన బాడీలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది. తరచూ చద్దన్నం తినడంవల్ల ఫైబర్‌ కంటెంట్ పెరిగి మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా ర‌క్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. శ‌రీరం ఎక్కువ‌సేపు ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది. అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే త‌గ్గిపోతాయి. ఎదిగే పిల్లల‌కు కూడా చ‌ద్దన్నం మంచి పౌష్టికాహారం.

ఈ చద్దన్నం స‌న్నగా ఉన్నవాళ్లు లావ‌య్యేందుకు, లావుగా ఉన్నవాళ్లు స‌న్నబ‌డేందుకు కూడా తోడ్పడుతుంది. లావు తగ్గాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని రాత్రే చ‌ల్లలో నాన‌బెట్టుకుని ఉద‌యాన్నే తినాలి. రోజూ ఇలా చేయడంవల్ల స్థూలకాయులు క్రమంగా లావు త‌గ్గుతారు. అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారేస‌రికే తోడ‌న్నం త‌యార‌వుతుంది. నిత్యం ఈ తోడన్నం తినడంవల్ల స‌న్నగా ఉన్నవాళ్లు క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా పాలతో తోడేసిన అన్నాన్ని గానీ, చ‌ల్లలో నాన‌బెట్టిన అన్నాన్నిగానీ నేరుగా తిన‌బుద్దికాక‌పోతే వాటికి ఉల్లిముక్కలు, టమాటా, క్యారెట్ లాంటివి కలుzపుకుని తాలింపు పెట్టుకుని కూడా లాగించొచ్చు.

గమనిక : అయితే, ఇలా చేసి పెట్టుకున్న చ‌ద్దన్నాన్ని తప్పనిసరిగా ఉదయాన్నే తినాలి. మ‌రింత ఆలస్యం చేస్తే అది ఎక్కువ‌గా పులిసి విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి ఆహారం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Comments

-Advertisement-