-Advertisement-

BSNL: బిఎస్ఎన్ఎల్ 4G వినియోగదారులకు బంపర్ ఆఫర్..!

BSNL recharge plans 4G unlimited calls and data About bsnl 4g plans for 1 year BSNL recharge Plans 4G 84 days BSNL recharge plans 4G 365 days BSNL Dat
Priya

BSNL: బిఎస్ఎన్ఎల్ 4G వినియోగదారులకు బంపర్ ఆఫర్..!

యూజర్లకు భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) త్వరలో శుభవార్త చెప్పనున్నది. బీఎన్‌ఎస్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతున్నది. ఆగస్టు నాటికి సేవలను లాంచ్‌ చేయనున్నది.

BSNL recharge plans 4G unlimited calls and data About bsnl 4g plans for 1 year BSNL recharge Plans 4G 84 days BSNL recharge plans 4G 365 days BSNL Data plans BSNL recharge plans 4G 28 days About bsnl 4g plans tamilnadu BSNL 4G plans for 1 Month

యూజర్లకు భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) త్వరలో శుభవార్త చెప్పనున్నది. బీఎన్‌ఎస్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించబోతున్నది. ఆగస్టు నాటికి సేవలను లాంచ్‌ చేయనున్నది. గతంలోనూ 4జీ సేవలు ప్రారంభంపై వార్తలు వచ్చినా.. తాజాగా సంస్థ 4జీ ప్లాన్స్‌ను సైతం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సోషల్‌ మీడియా ద్వారా ప్లాన్‌ వివరాలను వెల్లడించింది.

ప్లాన్స్‌.. ప్రయోజనాలు..

PV2399 : ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,399 ప్లాన్‌ 395 రోజుల వాలిడిటీతో వస్తున్నది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. అలాగే నిత్యం 2జీబీ డేటా పొందవచ్చు.

PV1999 : ఈ ప్లాన్ 600GB డేటాతో పాటు 365 రోజుల చెల్లుబాటు అవుతుంది. 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు సైతం వస్తాయి. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.

PV997 : బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.997 ప్లాన్‌లో చేరితో ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.

STV599 : ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్ 84 రోజుల వ్యాలిటీతో వస్తుంది. అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 3జీబీ డేటాను వస్తుంది.

STV347 : ఈ ప్లాన్ రూ.347 ఇది 54 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2జీబీ డేటాతో పాటు 100 ఉచితంగా ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.

PV199 : ఈ ప్లాన్‌ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇది రోజుకు 2జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎంఎంఎస్‌లు వస్తాయి.

PV153 : ఈ ప్లాన్‌లో 26 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. మొత్తం 26జీబీ డేటా, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్‌ ఉంటుంది.

STV118 : ఈ ప్లాన్‌ 20 రోజుల వ్యాలిడిటీ చెల్లుబాటుతో 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 10 జీబీ డేటాను వస్తుంది.

Comments

-Advertisement-