రోజూ రాత్రి లేటుగా నిద్రపోతున్నారా... అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు
రోజూ రాత్రి లేటుగా నిద్రపోతున్నారా.. అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు
రాత్రి ఒంటి గంట వరకు మేలుకుని, తెల్లారి ఆలస్యంగా నిద్ర నుంచి లేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.
ఒంటి గంట వరకు మేలుకుని, తెల్లారి ఆలస్యంగా నిద్ర నుంచి లేవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. వీరు ఈ అధ్యయనంలో భాగంగా బ్రిటన్‌లోని 73,000 మంది వయోజనులను పరిశీలించారు. త్వరగా నిద్ర నుంచి మేలుకోవడం, ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం, నిద్రపోయే సమయం వంటి వాటిని విశ్లేషించారు. నిద్రపోయే వేళలు, మానసిక ఆరోగ్యం, ప్రవర్తనలో నిలకడ లేకపోవడం వంటి వాటికి పరస్పర సంబంధం ఉందని వెల్లడైంది.
రాత్రి ఒంటి గంట తర్వాత నిద్రకు ఉపక్రమించి, తెల్లవారిన తర్వాత ఆలస్యంగా నిద్ర నుంచి లేచి, రాత్రి వేళల్లో చురుగ్గా ఉండేవారి మానసిక ఆరోగ్యం కన్నా రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించి, తెల్లవారిన తర్వాత త్వరగా నిద్ర నుంచి మేలుకుని, పగటి సమయంలో చురుగ్గా ఉండేవారి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది. రాత్రి ఒంటి గంట తర్వాత నిద్రకు ఉపక్రమించేవారు నిర్ణయాలు తీసుకోవడంలో, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటారని వెల్లడైంది. ఈ పరిస్థితికి ఇతర మానసిక సమస్యలైన ఒత్తిడి, ఆందోళన వంటివాటితో కూడా సంబంధం ఉంటుంది. ఇటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడాలంటే, నిద్రకు ఉపక్రమించే సమయంలో మార్పులు చేసుకోవాలని పరిశోధకులు సూచించారు. వారి సూచనల ప్రకారం మొదటి వారంలో 15 నిమిషాల ముందు నిద్రకు ఉపక్రమించాలి. ఇదే విధంగా క్రమంగా త్వరగా నిద్రపోయేలా అలవాటు చేసుకోవాలి.