రేషన్ దుకాణాల తనిఖీలకు మంగళం పాడారా?
రేషన్ దుకాణాల తనిఖీలకు మంగళం పాడారా?
90 శాతం దుకాణాల్లో అక్రమాలు అవినీతి..
ముడుపులతో సరి వాహనాలు ఉన్న బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్న రేషన్ బియ్యం..
తిలాపాపం తలా పిడికెడు..
బద్వేలు, జూలై 9 (పీపుల్స్ మోటివేషన్):
రేషన్ దుకాణాల తనిఖీలకు రెవెన్యూ అధికారులు మంగళం పాడారా ? వారి వ్యవహారం చూస్తుంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తు న్నాయి. బద్వేలు గోపవరం మనలాల్లో దాదాపు 60కి పైగా దుకాణాలు ఉన్నాయి 90 శాతం పైగా రేషన్ దుకాణాల్లో అనేక అక్రమాలు జరుగు తున్నాయి. ఈ విషయం సంబంధిత అధికారులు కూడా బాగా తెలుసు. ప్రభుత్వం ఇటీవల రేషన్ ఇచ్చేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసింది వీటిలో కొన్ని వాహనాలు ఎప్పుడో మూలనపడ్డాయి. పనిచేస్తున్న వాహనాల ద్వారా బియ్యము ఇతర సరుకులు పంపిణీ జరుగుతున్నప్పటికీ వాటిలో అధిక భాగం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కూడా ప్రవేట్ సంభాషణలో అంగీక రిస్తున్నారు. నెలవారి ముడుపులకు అలవాటుపడ్డ కొందరు అధికారులు కొంతమంది సిబ్బంది కనీసం తనిఖీలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఫిర్యాదులు వస్తే రేషన్ షాపులు తనిఖీలు చేస్తామని వితండ వాదాన్ని అధికారులు వినిపిస్తున్నారు. మొదటినుంచి వీరి వ్యవహారం ఇలాగే ఉంది. రేషన్ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలు అన్ని ఇన్ని కావు. ప్రతి సరుకులో కోత విధిస్తున్నారు. ముఖ్యంగా బియ్యం విషయంలో కేజీ నుండి మూడు కేజీల వరకు తగ్గించి బ్లాక్ మార్కెట్ కు పంపుతున్నారు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. రేషన్ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలు అధికారులకు బాగా తెలుసు కానీ వారిస్తున్న ముడుపులు వారి చేతులు కట్టేస్తున్నాయి. కొంతమంది రేషన్ దుకాణాల వారితో బాధ్యత కలిగిన సిబ్బందికి విడదీయరాని సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా ఎవరు కాదనలేని నిజం బ్లాక్ మార్కెట్ చేసేవారు. విలాసవంత మైన వాహనాల్లో తిరుగుతూ నిబంధనలకు విరుద్ధంగా కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తూ కేవలం కార్యాలయాలకు పరి మితమయ్యారు. ఇది కూడా ఎవరు కూడా కాదనలేని పచ్చి నిజం. విలా సంతమైన వాహనాలు కూడా రేషన్ డీలర్లు ఇచ్చిన ముడుపులతో కొనుగోలు చేసినవే అధికారులు సిబ్బంది రేషన్ దుకాణాలను మొక్కుఐ డిగా తనిఖీలు చేసిన పాపాన ఇంతవరకు పోలేదు. ఇది డీలర్లకు వరంగా మారింది. దుకాణాలకు వచ్చిన సరుకులు రేషన్ కార్డుదారులకు సక్రమంగా ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ విషయం కూడా సంబంధిత అధికారులకు బాగా తెలుసు, బియ్యము ఇతర సరుకులు అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లతో చేతులు కలిపిన మెజార్టీ డీలర్లు బియ్యాన్ని ప్రజలకు అందివ్వకుండా వేరు వేరు మార్గాల ద్వారా తరలించ వలసిన చోటికి ప్రతినెల తరలిస్తున్నారు. ఈ విషయం కూడా అధికారు లకు ఎంతో బాగా తెలుసు. అయినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందవలసిన సరుకును తూకాల్లో కోత విధిస్తూ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు ఇదేమి అన్యాయమని ఎవరైనా నిలదీస్తే మీకు దిక్కు ఉన్నచోట చెప్పుకోమని కొంతమంది డీలర్లు ప్రజలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కొంతమంది డీలర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటే వారి వెనుక ఎవరున్నారో చెప్పకనే తెలిసిపోతుంది. బద్వేలు గోపవరం మండలాల్లో దాదాపు 90 శాతం పైగా దుకాణాల్లో ఈ తతంగమే నడుస్తుంది. హక్కులు కమిషన్ల కోసం పోరాడే డీలర్లు ప్రజల నోరు కొట్టడం దారుణం దీనికి కొంతమంది అధికారులు మరి కొంతమంది సిబ్బంది వంత పాడడం విచిత్రం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలు జరగకుండా సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేయా లని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నప్పటికీ ఫలితం మాత్రం ఎక్కడ కానరావడం లేదు ముఖ్యమంత్రి ఆశయాలకు ఆదేశాలకు కొందరు అధికారులు సిబ్బంది తూట్లు పొడుస్తున్నారు రేషన్ దుకాణాలు కనీసం మొక్కుబడిగా తనిఖీ చేయకపోవడం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతుంది ఫిర్యాదులు వస్తేనే రేషన్ దుకాణాలు తనిఖీ చేస్తామని చెబుతున్న అధికారులు ముడుపులు దండుకోవడంలో మాత్రం అందరి కంటే ముందు ఉంటారు. రేషన్ దుకాణాల నుంచి స్మగర్ల నుంచి నెలవారి ముడుపులు ఎంత తీసుకుంటారు అనే విషయం త్వరలో బట్టబయలు కానుంది. ముడుపుల వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే వివరాలు త్వరలో తెలుస్తాయి ఈ ముడుపుల విషయంలో తిలాపాపం తల పిడికెడు అనే చందంగా చాలా కాలంగా కొనసాగుతుంది.