మిస్ ఏఐ పోటీల్లో విజేతగా కెంజా లాయ్ లీ
మిస్ ఏఐ పోటీల్లో విజేతగా కెంజా లాయ్ లీ
ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన "మిస్ ఏఐ" పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెంజా లాయ్ లీ (Kenza Layli) విజేతగా నిలిచారు. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి "మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న అందాల సుందరి"గా నిలిచారు. విజేతగా నిలిచిన ఆమెకు 20 వేల డాలర్ల ప్రైజ్మనీ దక్కింది.
•"వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్" పేరుతో సబ్స్క్రిప్షన్ ఆధారిత క్రియేటర్స్ ప్లాట్ఫామ్ "ఫ్యాన్వ్యూ" ఈ పోటీలను నిర్వహించింది. ప్రపంచంలోనే ఈ తరహా పోటీ జరగడం ఇదే తొలిసారి. ఈ మొట్టమొదటి "Miss Al" పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి 1500 మంది ఏఐ మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు పోటీపడ్డారు.
• ఫ్రాన్స్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ లలీనా వలీనా రెండో స్థానంలో, పోర్చుగల్కు చెందిన ట్రావెలర్ ఒలీవియా సి మూడో స్థానంలో నిలిచారు.
• ఈ ఏఐ కెంజా లాయ్ ను ఫోనిక్స్ ఏఐ సీఈవో మెరియమ్ బెస్సా అనే క్రియేటర్ సృష్టించారు. భారత్ నుంచి జారా శతావరీ టాప్ 10 ఫైనలిస్ట్లో నిలిచింది. ఈ ఊహా సుందరుల లుక్స్, వీరిని సృష్టించడం కోసం ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యాలు. సోషల్ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 'మిస్ ఏఐ' విజేతను ఎంపిక చేశారు.
• ఈ పోటీలకు మొత్తం నలుగురు న్యాయనిర్ణేతలు ఉండగా వీరిలో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నారు.
• కెంజా లాయ్స్ ఇన్స్టాగ్రామ్లో ఫుడ్, కల్చర్, ట్రావెల్, ఫ్యాషన్, బ్యూటీ వంటివాటిపై వీడియోలు చేస్తుంటుంది. మహిళా పురోగతి, పర్యావరణాన్ని కాపాడడం, పాజిటివ్ రోబో కల్చర్పై అవగాహన పెంచేందుకు ఈ విజయం ద్వారా వచ్చిన పేరును ప్రఖ్యాతులను ఉపయోగించుకుంటానని వాగ్దానం చేసింది.
• ఏఐ అనేది మానవ సామర్థ్యాలను మరింత పెంచేందుకు రూపొందించబడిన సాధనం తప్ప వారిని భర్తీ చేసేది కాదని కెంజా లాలీ లీ స్పష్టం చేసింది.