-Advertisement-

టీడీపీకి పూర్వ వైభవం..?

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New
Peoples Motivation

టీడీపీకి పూర్వ వైభవం..?

హైదరాబాద్, జూలై 16 (పీపుల్స్ మోటివేషన్ ):

తెలంగాణలో బలపడేందుకు తెలుగుదేశం పార్టీ సర్కా వ్యూహంతో ముందుకు పోతోందా శాఖ? గతంలో పార్టీని వీడిన సీనియర్లను మళ్లీ సొంతగూటికి రావాలని ఆహ్వానిస్తుందా? ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డితో టెడ్లో ఉన్న టీడీపీ అధిష్టానం.. మరో సీనియర్ నేతతోనూ టచ్లోకి వెళ్లిందా? టీడీపీ అధిష్టానమే చొరవ చూపుతోందా? లేక మాజీ నేతలే తెలంగాణలో టీడీపీ ద్వారా పూర్వ వైభవం కోసం ప్లాస్ చేస్తున్నారా?ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన తర్వాత. తెలంగాణలో తెలుగుదేశం బలోపేతానికి అడుగులు పడుతున్నాయి. 

General News telugu Trending news telugu Intresting news Telugu daily news Current Affairs Quiz Current Affairs pdf Breaking news telugu Political New

తెలంగాణలో కి పూర్వవైభవం తేవాలని చంద్రబాబు కసరత్తు చేస్తున్న సమయంలోనే.. పలువురు నేతలు టీడీపీలోకి వస్తామంటూ వర్తమానం పంపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు తెలుగుదేశంలో చేరేందుకు ఆసక్తి మాపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీలోకి వెళతాదనే ఊహాగానాలు వినిపిస్తుండగా, ఇప్పుడు దూజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా టీడీసీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వరరావు గతంలో టీడీపీ నుంచే బీఆర్ఎస్లోకి వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఏపీలో చంద్రబాబు సర్కార్ తిరుగులేని విజయం సాధించడంతో మళ్లీ సొంతగూటికి వెళ్లాలని నామా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పారిశ్రామిక వేత్తగా రాజకీయాల్లో సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న నామా నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లాలో గట్టి పట్టుంది, టీడీపీ కూడా జిల్లాలో క్యాదర్ ఎక్కువగా ఉండటం, ఖమ్మంలో బీఆర్ఎస్ పెద్దగా ఐలం లేకపోవడంతో రామా మళ్లీ టిడీపీలో చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. అటు సీఎం చంద్రబాబుతోనూ నామా నాగేశ్వరరావుడు సత్సంబంధాలు. ఉండటం కూడా కలిసివస్తుందంటున్నారు. ఆర్ధిక జలం ఉన్న నామా, మల్లారెడ్డి వంటివారు పార్టీలోకి తిరిగి వస్తే రాష్ట్రంలో నిలదొక్కుకోవచ్చని టీడీపీ కూడా ఆశిస్తోందని చెబుతున్నారు. మరోవైపు గత నెలలో హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో నామా నాగేశ్వరరావు పాల్గొనడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.

టీడీపీలో ఉండగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా "డా మెలిగిన నామా.. రాష్ట్ర విభజన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సివచ్చిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. టీడీపీని వీడిన ఏనాడు చంద్రబాబును గాని, టీడీపీని గాని నామా విమర్శించలేదని ఖమ్మంలో టీడీపీ క్యాడర్ను సైతం విస్మరించలేదని గుర్తు చేస్తున్నారు నామా అనుచరులు, స్వతహాగా వ్యాపార వేత్త అయిన నామా బీఆర్ఎస్లో ఉండగా, టీడీపీ క్యాడర్కు

సహకరించేవారు. దీంతో ఆయన రాకను ఖమ్మం టీడీపీ కూడా స్వాగతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నామాను కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఆ పార్టీ కూడా ఆహ్వానిస్తోంది. ఐతే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉండటం వల్ల తాను ఆ పార్టీలో చేరినా పెద్దగా గుర్తింపు ఉండదని భావిస్తున్నారట నామా నాగేశ్వరరావు, టీడీపీలో చేరి ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించొచ్చని ఆశిస్తున్నారట నామా నాగేశ్వరరావు. మొత్తానికి మల్లారెడ్డి తర్వాత నామా నాగేశ్వరరావు కూడా టీడీపీ వైపు నూస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలంగాణాలో హాట్టాపిక్గా మారింది.

Comments

-Advertisement-