-Advertisement-

Bandh: రేపు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

Students union bandh tomorrow Students union bandh today AP bandh tomorrow Today AP bandh or not Is tomorrow bandh in AP for schools Tomorrow bandh
Pavani

Bandh: రేపు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

నీట్- నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలి..

జులై 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు- కళాశాలలు బంద్..

SIF-AISF- PDSU- PDSO- NSUI విద్యార్థి సంఘాలు పిలుపు..

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై నిరసన..

Student Unions: నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జులై 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్కు SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై నిరసన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి. కాగా, నీట్, నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్లో మోదీ సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ఈయూ, పీడీఎస్వో, ఎస్ఎఫ్ఎ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్, నెట్ మాత్రమే కాదు.. గత కొన్నేళ్లుగా అన్ని పరీక్షల పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యాశాఖపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పరీక్షలు వారి జీవితాలకు సంబంధించినవని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. 

Students union bandh tomorrow Students union bandh today AP bandh tomorrow Today AP bandh or not Is tomorrow bandh in AP for schools Tomorrow bandh

మరోవైపు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూలై 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించగా.. ఆ రోజు తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా సెలవు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు. అలాగే ఈ నెలలో మరో సెలవు కూడా రాబోతోంది. జులై 27న పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం బోనాలు పండుగను పురస్కరించుకుని సెలవు ప్రకటించింది. తెలంగాణలోని ప్రధాన పండుగల్లో బోనాలు ఒకటి. 7 జూలై 2024న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించి బోనాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో జూలై 27వ తేదీని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. ఆ రోజు శనివారం మరియు మరుసటి రోజు జూలై 28 ఆదివారం. ఈ లెక్కన రెండు రోజుల సెలువు రాబోతోంది.

Comments

-Advertisement-