AP Govt New Sand Policy: ఏపీలో జులై 8 నుంచి అమల్లోకి ఉచిత ఇసుక విధానం
AP sand policy 2021 pdf
Ap sand policy pdf
Ap sand policy 2021
sand.ap.gov.in login
Ap Sand tender
Sand Department
G.O. No 71 ANDHRA PRADESH
AP Mines
By
Priya
AP Govt New Sand Policy: ఏపీలో జులై 8 నుంచి అమల్లోకి ఉచిత ఇసుక విధానం
మార్గదర్శకాలు విడుదల చేసిన గనుల శాఖ..
ఇసుక తవ్వకాలు, రవాణా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరాదని ప్రభుత్వ నిర్ణయం..
టన్ను ఇసుకపై రూ. 88 మాత్రమే వసూలు.. ఆ సొమ్ము కూడా స్థానిక సంస్థలకే మళ్లింపు..
నది ఇసుక టన్ను రూ. 288కే ప్రజలకు విక్రయం..
అక్టోబర్ నుంచి ఆన్ లైన్ విధానంలో పర్మిట్ల జారీ, చెల్లింపులు..
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గనులశాఖ రూపొందించింది. ఈ నెల 8 నుంచి నూతన మార్గదర్శకాలను అమలు చేయనుంది.
ఆ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి:
- ఇకపై ఇసుక తవ్వకాలు, రవాణా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది.
- గత ప్రభుత్వం టన్ను ఇసుకను రూ. 475 చొప్పున విక్రయించింది. అందులో కాంట్రాక్టర్ చేపట్టే తవ్వకాలు, రవాణా ఖర్చు రూ. 100 తీసేయగా మిగిలిన రూ.375 ప్రభుత్వ ఖజానాకు చేరేది.
- కానీ ఇక నుంచి రూ. 375 కాకుండా రూ. 88 మాత్రమే వసూలు చేయనున్నారు. పైగా ఆ సొమ్ము కూడా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లోనే జమ కానుంది.
- అలాగే సీనరేజి చార్జీ కింద ప్రతి టన్నుకు వసూలు చేసే రూ. 66 జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు అందనుంది. జిల్లా ఖనిజ నిధి కింద రూ.19.80 చొప్పున వసూలయ్యే మొత్తం ఇసుక రీచ్ ల అభివృద్ధికి జిల్లా ఖాతాలో జమ కానుంది.
- ఖనిజాన్వేషణ నిధి కోసం వసూలు చేసే మిగతా రూ.1.32 గనుల శాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్ ఖాతాలోకి వెళ్లనుంది. మొత్తంగా చూస్తే నూతన విధానంలో ఇసుక కొనుగోలుదారులకు ఇకపై ప్రతి టన్నుపై రూ. 287 ఆర్థికభారం తగ్గనుంది.
- ఈ నెల 8 నుంచి నిల్వ కేంద్రాల్లో ఇసుక విక్రయాలు చేసినప్పుడు టన్నుకు రూ. 88తోపాటు ఆ నిల్వ కేంద్రానికి ఏ రీచ్ నుంచి ఇసుక తవ్వి, తీసుకొచ్చారో ఆ రవాణా వ్యయం, స్టాక్ పాయింట్‌లో లోడింగ్ అయ్యే ఖర్చు తీసుకోనున్నారు. ఈ రేట్‌ను కలెక్టర్లు ఖరారు చేస్తారు.
- బోట్స్‌మెన్ సొసైటీలు నదుల్లోంచి తీసుకొచ్చే ఇసుకను ఇప్పటివరకు టన్ను రూ. 625 చొప్పున విక్రయియిస్తున్నారు. అందులో బోట్స్‌మెన్ సొసైటీకి టన్నుకు రూ. 200 చొప్పున చెల్లిస్తున్నారు. కానీ కొత్త విధానంలో ఇక నుంచి బోట్స్‌మెన్ సొసైటీలు తెచ్చే టన్ను ఇసుకపై రూ. 200తోపాటు సీనరేజి రూ. 88 కలిపి రూ. 288కే ప్రజలకు విక్రయించనున్నారు.
- సెప్టెంబర్ వరకు మాన్యువల్ విధానంలో ఇసుక విక్రయాలు సాగనున్నాయి.
- అక్టోబర్ నుంచి మాత్రం ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేయడంతోపాటు చెల్లింపులు సైతం ఆన్‌లైన్ లోనే ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.
- ఇసుక తరలించే ప్రతి లారీ, ట్రాక్టర్ గనుల శాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి ఒక మార్గంలో అనుమతి తీసుకొని మరో రూట్లో వాహనాన్ని తిప్పితే అధికారులు చర్యలుక్ష్మీప్రసన్న తీసుకుంటారు.
Comments