-Advertisement-

AP Govt: 25 మంది దివ్యాంగ విద్యార్థులకు కోసం జీవో జారీ...!

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines
Pavani

AP Govt: 25 మంది దివ్యాంగ విద్యార్థులకు కోసం జీవో జారీ...!

ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం పొందిన ఏపీకి చెందిన దివ్యాంగులు

మార్కుల జాబితాలో ఉన్న అడ్డంకిని తొలగించిన విద్యాశాఖ

జీవో ఉంటేనే ఆ మార్పును అంగీకరిస్తామన్న ఐఐటీలు, ఎన్ఐటీలు

వాట్సాప్ ద్వారా లోకేశ్ కు సమాచారం అందించిన విద్యార్థులు

వెంటనే జీవో జారీ చేసిన మంత్రి నారా లోకేశ్

ఏపీ మంత్రి నారా లోకేశ్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడారు. లోకేశ్ చూపిన చొరవతో దివ్యాంగులైన ఆ విద్యార్థులు దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. ఒక్క జీవోతో నారా లోకేశ్ వారి భవితవ్యాన్ని మార్చివేశారు. 

Daily telugu Daily trending news Breaking news telugu Telugu news Telugu stories Crime News Politics news Current Affairs pdf Today Latest headlines

పూర్తి వివరాల్లోకెళితే.... ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ లు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్ట్ తో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులు ఉంటాయి.

మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికేట్‌లో ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎప్పటినుంచో 'E' (EXEMPTION) అని మాత్రమే పేర్కొంటూ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అయితే కొన్ని ఐఐటీలు, ఎన్ఐటీల్లో సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్‌లో 'E' స్థానంలో నిర్దిష్ట కనీస మార్కులు ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు. దాంతో, చాలామంది దివ్యాంగులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 

ఈ విషయాన్ని ఏపీకి చెందిన కొందరు దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర విద్యాశాఖకు తెలియజేయగా... విద్యాశాఖ స్పందించి E స్థానంలో కనీస మార్కులు 35 అని పేర్కొంటూ ఆ మేరకు వివరాలు పొందుపరిచి తాజా సర్టిఫికెట్లు జారీ చేసింది.

అయితే, పృథ్వీ సత్యదేవ్ అనే దివ్యాంగ విద్యార్థి తాజా సర్టిఫికెట్ ను తీసుకుని మద్రాస్ ఐఐటీలో ప్రవేశం కోసం ఆన్ లైన్ లో సర్టిఫికెట్ అప్ లోడ్ చేయగా, వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో ఉంటేనే ఈ మార్పు చెల్లుబాటు అవుతుందని మెలికపెట్టారు. ఇదే పరిస్థితి చాలామంది దివ్యాంగ విద్యార్థులకు ఎదురైంది. దాంతో వారిలో కొందరు వాట్సాప్ ద్వారా మంత్రి నారా లోకేశ్ కార్యాలయానికి సమాచారం అందించారు.

అప్పటికి ఆ దివ్యాంగ విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి ఎక్కువ సమయం కూడా లేదు. దాంతో, మెరుపువేగంతో స్పందించిన మంత్రి నారా లోకేశ్... వెంటనే శాఖాపరమైన జీవో జారీ చేసి ఆ విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకుండా కాపాడారు. 

ఇప్పుడు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందిన ఆ దివ్యాంగ విద్యార్థుల ఆనందం అంతా ఇంతా కాదు. రేపు (జులై 8) వారంతా ఉండవల్లి వచ్చి మంత్రి నారా లోకేశ్ ను కలవనున్నారు. తమ భవిష్యత్ ను కాపాడిన లోకేశ్ కు వారంతా కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.

మంత్రి లోకేశ్ చొరవతో జాతీయస్థాయిలో సీట్లు సాధించిన విద్యార్థులు వీరే...

1. ఎం.పృథ్వీ సత్యదేవ్, విజయవాడ – ఐఐటీ, మద్రాస్.

2. ఎన్. స్నేహిత, నెల్లూరు – ఐఐటీ, కాన్పూర్.

3. ఎ.తేజిత చౌదరి, తిరుపతి – ఐఐఐటీ, గౌహతి.

4. పి.నిష్మిత, నెల్లూరు – ఎన్ఐటీ, నాగపూర్.

5. సి.రఘునాథరెడ్డి, విజయవాడ – ఐఐటి, క్యాలికట్.

6. ఎం.మోహన్ నాగమణికంఠ, రాజమండ్రి – ఎన్ఐటి, జలంధర్.

7. బి.విజయరాజు, పామర్రు – ఐఐటి, తిరుపతి.

8. కె.ప్రశాంత్, కర్నూలు – ఎన్ఐటి, సిల్చార్.

10. జి.కృష్ణసాయి సంతోష్, విజయవాడ – ఎన్ఐటి, సూరత్కల్.

11. జి.వంశీకృష్ణ, రాజమండ్రి – ఎన్ఐటి, వరంగల్.

12. వి.వేదచరణ్ రెడ్డి, కర్నూలు – ఐఐటి, మద్రాసు.

13. నాయుడు రక్షిత్, నెల్లూరు – ఎన్ఐటి, నాగాల్యాండ్.

14. ఇ.మహీధర్ రెడ్డి, పెనమలూరు – ఐఐటి, ఇండోర్.

15. డి.మోక్షశ్రీ, అనంతపురం – ఎన్ఐటి, నాగాల్యాండ్.

16. పి.దినేష్, రాజమండ్రి – ఎన్ఐటి, కురుక్షేత్ర.

17. జె.మనోజ్ కుమార్, బి.కోట – ఐఐటి, గోవా.

18. సిహెచ్ శివరామ్, నందిగామ – ఐఐటి, అగర్తల

19. బి.అభిజిత్, విజయవాడ – ఎన్ఐటి, అరుణాచల్ ప్రదేశ్.

20. జి.రాణి, కాకినాడ – ఐఐటి, ఖరగ్ పూర్.

21. కె.గోకుల్ సాయి, గుంటూరు – ఎన్ఐటి, తాడేపల్లిగూడెం.

22. ఎం.అభిలాష్, విజయవాడ – ఐఐటి, తిరుపతి.

23. ఎం.అర్జున్ కుమార్, గుంటూరు – సెకండ్ రౌండ్ కు దరఖాస్తు.

24. ఆర్ఎస్ భరద్వాజ నాయుడు, తాళ్లవలస – ఎన్ఐటి, సిల్చార్.

25. జి.రేష్మిత, ఎనికేపాడు – ఐఐటి, తిరుపతి.

Comments

-Advertisement-