-Advertisement-

Antibiotics: ఎక్కువగా యాంటీ బయోటిక్ వాడడం వల్ల ఏమౌతుందో తెలుసా?

Disadvantages of using antibiotics in daily life helath news telugu helath tips telugu benefits advantages and disadvantage lifestyle side-effects etc
Priya

Antibiotics: ఎక్కువగా యాంటీ బయోటిక్ వాడడం వల్ల ఏమౌతుందో తెలుసా?

పూర్వం ఏదైనా వ్యాధి వస్తే.. ప్రకృతి వైద్యంపై ఆధారపడేవాళ్లు..

ప్రస్తుతం చిన్న సమస్యలకే యాంటీ బయోటిక్ వాడకం..

వాటి వాడకం ఎక్కువై అనేక సమస్యలు..

Disadvantages of using antibiotics in daily life helath news telugu helath tips telugu benefits advantages and disadvantage lifestyle side-effects etc

పూర్వం ఏదైనా వ్యాధి వస్తే.. ప్రకృతి వైద్యంపై ఆధారపడేవాళ్లు.. మన చుట్టుపక్కల్లో దొరికే చెట్లు, మూలికలతో వైద్యం చేసేవాళ్లు. కానీ..ప్రస్తుతం ఆంగ్ల మందులకు అలవాటు పడిపోయాం. ఏ చిన్న సమస్య వచ్చినా దానికి తగ్గ మందులు వేసుకుంటున్నాం. ఆ మందులు వేసుకోగానే.. ఉన్న సమస్య తగ్గి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాం. మనం తీసుకునే ప్రతి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లకు కారణమవుతోంది. ఇప్పుడు యాంటీ బయోటిక్ మందులు వాడటం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ప్రపంచం వ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి యాంటీ బయోటిక్ మందుల వాడకం 76 శాతం పెరిగిందని చెబుతున్నారు. అంతకు ముందు ఏదైన చిన్న అనారోగ్య సమస్య వస్తే లవంగాలు, సొంటి లాంటి ఇంట్లో వున్న వస్తువలతో ఆరోగ్య చిట్కాను పాటించేవారు.

కానీ ప్రస్తుతం అన్నింటికీ యాంటీ బయోటిక్ లను తీసుకుంటున్నారు. శరీరంలో క్రిములు ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నప్పుడు దాన్ని నిరోధించడానికి తెల్లరక్తకణాలు ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షను బంధించడానికి కొన్ని రకాల యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అయిదు రకాల యాంటీ బాడీలను మన శరీరం విడుదల చేస్తుంది. ఏ రకమైన క్రిములు శరీరంలోకి వెళ్లినా లోపల వున్న రక్షణ వ్యవస్థ వెంటనే స్పందిస్తుంది. అయితే ఇలా ఎదుర్కోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు బ్యాక్టీరియా విజృంభించడం వల్ల అసౌకర్యం మొదలౌతుంది. జలువు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతుంటాయి. దీన్ని వెంటనే తగ్గించుకోవడానికి యాంటీ బయోటిక్ మందులను మింగేస్తాం.

యాంటీబయోటిక్ నుంచి తప్పించుకోవడానికి బ్యాక్టీరియా తన సెల్ వాల్ను మార్చుకుంటుంది. బ్యాక్టీరియా తనలో టాక్సిన్స్, కెమికల్స్ ఉత్పత్తిని పెంచుకొని యాంటీబయోటిక్లకు రెసిస్టెన్ను పెంచుకుంటుంది. బ్యాక్టీరియా తన రూపాన్ని, గుణాలను మార్పు చేసుకొని యాంటీబయోటిక్లకు దొరక్కుండా తయారౌతుంది. పోలీసుల నుంచి దొంగలు చాకచక్యంగా తప్పించుకున్నట్టుగా బ్యాక్టీరియా కూడా యాంటీబయోటిక్ల నుంచి తప్పించుకొని తిరుగుతుంటుంది. ఎన్నిరకాల యాంటీబయోటిక్లను ప్రయోగించినా బ్యాక్టీరియా వాటితో పోరాడి నిలుస్తూనే ఉంటుంది. కాబట్టి యాంటీబాడీల వాడకాన్ని ఎంత తగ్గిస్తే శరీరంలో బ్యాక్టీరియా అంత ప్రమాదకరంగా మారకుండా ఉంటాయి. ఎమర్జెన్సీలో మాత్రమే యాంటీబయోటిక్లను ఉపయోగించాలి. చిన్న చిన్న రోగాలకు కూడా యాంటీబయోటిక్లను ఎక్కువగా ఉపయోగిస్తే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

Comments

-Advertisement-