Yoga: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం..! దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు..!
Yoga: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం..! దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు..!
దేశవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం..
యోగా వేడుకల్లో పాల్గొన్న ఇండియన్ ఆర్మీ సిబ్బంది..
జమ్ముకశ్మీర్ లో జరిగిన యోగా సదస్సులో పాల్గొన్న ప్రధాని
International Yoga Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం నుంచి అమెరికా దేశం వరకు ఉన్న ప్రజలు ఉత్సాహంగా యోగా చేస్తూ కనిపించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ రోజు (జూన్ 21న) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. కాగా, లేహ్లోని పాంగోంగ్ త్సోలో ఐటీబీపీ సైనికులు యోగా చేయడం కనిపించింది. అలాగే, సిక్కింలోని ముగుతాంగ్ సబ్ సెక్టార్లో ఐటీబీపీ జవాన్లు 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో యోగా చేశారు.
అలాగే, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 నాడు భారత ఆర్మీ సైనికులు ఉత్తర సరిహద్దులో మంచు కొండలపై యోగా చేశారు. ఇదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం కూడా యోగా సాధన చేసింది. ఇక, తూర్పు లడఖ్లోని ఇండియన్ ఆర్మీ అధికారులు తమ యోగా అసనాలతో అలరించారు. దీంతో పాటు లేహ్లోని కల్నల్ సోనమ్ వాంగ్చుక్ స్టేడియంలో యోగా కార్యక్రమం కూడా నిర్వహించారు. లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ఒడ్డున స్కూల్ పిల్లలు కూడా యోగా చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా కనిపించింది.
ఇక, యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్ కేఐసీసీ)లో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరులతో కలిసి యోగా చేశారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమం నుంచి ప్రధాని దేశ ప్రజలకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. ముంబైలో జరిగిన యోగా సెషన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. అలాగే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి హెచ్ఎ కుమారస్వామి కూడా యోగా చేస్తూ కనిపించారు. వీరితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తదితరులు యోగా చేశారు. కూడా యోగా చేస్తూ కనిపించారు.
International Yoga Day: భారతం నుండి ప్రపంచం వరకు.. చారిత్రక మూలాలు..
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం..
యోగా దినోత్సవానికి భారతదేశం నుండి ప్రపంచ సాధన వరకు ప్రాముఖ్యత..
యోగా ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు..
2014లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి.
International Yoga Day: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21 న జరుపుకునే యోగా దినోత్సవానికి ప్రాచీన భారతదేశం నుండి ప్రపంచ సాధన వరకు ప్రాముఖ్యత ఉంటుంది. ఆరోగ్యపరంగా యోగా యొక్క విశిష్టతను గుర్తించి 2014లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలను చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలోచనను ప్రతిపాదించారు. భారతదేశంలో 5,000 సంవత్సరాల క్రితం యోగా ఉద్భవించింది.ఇది శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానాన్ని మిళితం చేస్తుంది. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాలు యోగాభ్యాసాలను, వివిధ సంప్రదాయాలు, ఆలోచనల ద్వారా పుట్టుకొచ్చింది. ఇక యోగా 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.
స్వామి వివేకానంద, బీకేఎస్ అయ్యంగార్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులు యోగాను పశ్చిమ దేశాలకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు లక్షలాది మంది యోగాను దాని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం అభ్యసిస్తున్నారంటే ఇదంతా వారి పుణ్యమే అని చెప్పవచ్చు. దీంతో.. ఆధునిక యోగా వివిధ జీవన విధానాలకు అనుగుణంగా మారింది. యోగాలో హఠ, విన్యాస, అష్టాంగ వంటి విభిన్న శైలులు ఉన్నాయి. యోగా స్టూడియోలు, ఆన్లైన్ తరగతులు అన్ని వయసుల వారికి ఫిట్నెస్ కోసం అందుబాటులో ఉంటున్నాయి. కాగా.. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమాల ద్వారా గుర్తించబడింది.
పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ కలిసి యోగా సాధన చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఐక్యత, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సమాజం అంతా ఒక్కటే అనే సంకేతాలు పంపుతాయి. అయితే ప్రాచీన భారతదేశం నుంచి ఒక సంప్రదాయంగా వస్తున్న యోగా ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది. ఇక.. పాశ్చాత్య దేశాల్లో యోగాను రెగ్యులర్ ప్రాక్టీస్గా చేస్తుంటారు. దీంతో ఎక్కువ మంది ప్రజలు యోగాపై ఆశక్తి చూపించడం వలన దాని ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా జీవితాలను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి.