Weight loss: వాము నీరు ఎందుకు తాగాలి.. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
Weight loss: వాము నీరు ఎందుకు తాగాలి.. ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
జీవక్రియను పెంచడంలో వాము మంచిగా పనిచేస్తుంది. ఇందులోని థైమోల్ అనే ఎంజైమ్ కారణంగా గ్యాస్ట్రిక్ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీల బర్నింగ్ చేయడంలో సహకరిస్తుంది. బరువు తగ్గాలన్నా కూడా వాము నీరు చక్కగా పనిచేస్తుంది.కాస్త జలుబు చేసినా, కడుపు నొప్పి ఉన్నా డాక్టర్ల దగ్గరకు వెళిపోతుంటాం. వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లు వాడేసి తగ్గిందనిపిస్తాం. కానీ ప్రతి చిన్న విషయానికి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కలిగే ఉపయోగాల కన్నా, కాలం గడిచే కొద్దీ పొందే అనర్థాలే ఎక్కువ. అందుకే మన పెద్దవారు ప్రతి దానికి ఇంటి చిట్కాలను వాడేవారు. మన వంటింటిలోని ప్రతి పదార్థమూ ఆరోగ్యాన్నిచ్చేది. అందులో ఒకటి వాము.మంచిది. పూర్వం నుంచి వామును చాలా రకాల అనారోగ్యాలలో వాడుతూనే ఉన్నాం. అంతే కాకుండా మన ఆహారంలో భాగం చేసుకున్నాం కూడా. పిల్లల్లో, పెద్దల్లో వాము నీరు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కడుపు తేలిగ్గా ఉంటుంది. జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే వాము గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వాము వాటర్ ఎందుకు తాగాలి.
జీవక్రియను పెంచడంలో వాము మంచిగా పనిచేస్తుంది. ఇందులోని థైమోల్ అనే ఎంజైమ్ కారణంగా గ్యాస్ట్రిక్ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీల బర్నింగ్ చేయడంలో సహకరిస్తుంది. బరువు తగ్గాలన్నా కూడా వాము నీరు చక్కగా పనిచేస్తుంది. అదనపు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వాము నీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.