Water Benefits: నీళ్లను ఎక్కువగా తాగితే బరువు త్వరగా తగ్గుతారా..?
Water Benefits: నీళ్లను ఎక్కువగా తాగితే బరువు త్వరగా తగ్గుతారా..?
మానవ శరీరంలో ఎక్కువ శాతం నీటిని కలిగి ఉంటుంది.. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రెడ్ గా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి.. నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుందనేది నిజమేనా? నిజానికి నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నీరు తాగడం వల్ల కేలరీలు కూడా వేగంగా కరిగిపోతాయని అంటున్నారు.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కాస్త వివరంగా తెలుసుకుందాం.
మాములుగా నీటిని రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు వరకు తాగాలని నిపుణులు చెబుతున్నారు.. మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే, సరైన పద్ధతిలో నీరు త్రాగండి. మీరు బరువు తగ్గాలనుకుంటే, ఆహారం తీసుకున్న అరగంట తర్వాత లేదా తినడానికి 2 గంటల ముందు ఎల్లప్పుడూ నీరు త్రాగాలి.. నీళ్లు తాగితే ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది.. అతిగా తినకుండా ఉంటారు. మీరు పరిమితుల్లో తినేటప్పుడు, బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది. అలాగే, మీరు చిరుతిండికి దూరంగా ఉండండి..
ఈ నీటిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయి.. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరానికి పోషకాలను అందించడంతో పాటు శరీరంలోని మురికిని కూడా తొలగిస్తుంది.. అలాగే వారానికి ఒకసారి నీటి ఉపసవాసం చెయ్యడం మంచిది.. కొంతమంది ఇలా 8 రోజుల పాటు నిరంతరం చేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఆయాసం, తల తిరగడం, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.. అందుకే ఒక్కసారి తీసుకోవాలి.. ఇది గుర్తుంచుకోవాలి..