-Advertisement-

Vitamins: విటమిన్-బి12 శరీరానికి అవసరమే.. కానీ ఎక్కువగా తీసుకుంటే జరిగేది ఇదే..!

Vitamin B12 Vitamins vitamins diabetes vitamins list vitamins food types of vitamins vitamins pdf types of vitamins and their functions vitamins uses
Priya
Vitamins: విటమిన్-బి12 శరీరానికి అవసరమే.. కానీ ఎక్కువగా తీసుకుంటే జరిగేది ఇదే..!
Vitamin B12 Vitamins vitamins diabetes vitamins list vitamins food types of vitamins vitamins pdf types of vitamins and their functions vitamins uses
ఎక్కువగా మాంసాహారంలో లభించడం వల్ల శాకాహారం తీసుకునేవారిలో విటమిన్-బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలామంది విటమిన్-బి12 లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. అయితే విటమిన్-బి12 అవసరమైన దానికంటే ఎక్కువ శరీరంలోకి వెళితే ఏం జరుగుతుందంటే..
విటమిన్-బి12 శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. అయితే వయసు, తీసుకునే ఆహారం, శరీరంలో ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని విటమిన్-బి12 ను తీసుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా పెద్దలు రోజుకు 2.4 మి.గ్రా విటమిన్-బి12 తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే అది ఆరోగ్యానికి సురక్షితం కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం లేదా సప్లిమెంట్ కంటే ఇంజెక్షన్లు ఎక్కువగా తీసుకోవడం కారణంగా విటమిన్-బి12 శరీరంలోకి ఎక్కువగా వెళుతుంది.
మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
తలనొప్పి, మైకం, విరేచనాలు, చర్మం పై దద్దుర్లు, దురద, వికారం, వాంతులు, అలసట, వాపు, జలదరింపు వంటి సమస్యలు అన్నీ విటమిన్-బి12 ఎక్కువగా శరీరంలోకి వెళ్లడం వల్ల జరుగుతాయి. అంతేకాదు.. విటమిన్-బి12 శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ శరీరంలో ఉంటే అనాపిలాక్సిస్ అని పిలువబడే అరుదైన, తీవ్రమైన అలెర్జీ సమస్యకు దారితీస్తుంది.
Comments

-Advertisement-