UGC NET exam యూజీసీ నెట్ పరీక్షకు త్వరలో కొత్త తేదీలు : కేంద్ర విద్యాశాఖ
Ugc net telugu
Ugc net 2024
UGC NET city intimation
UGC NET online
UGC NET Answer Key
UGC NET official website
UGC NET exam date 2024
UGC NET 2024 off
By
Pavani
UGC NET exam యూజీసీ నెట్ పరీక్షకు త్వరలో కొత్త తేదీలు : కేంద్ర విద్యాశాఖ
దేశవ్యాప్తంగా నిర్వహించిన జీసీ-నెట్ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-జాతీయ అర్హత పరీక్ష)లో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTS) బుధవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.UGC NET exam | దేశవ్యాప్తంగా నిర్వహించిన జీసీ-నెట్ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-జాతీయ అర్హత పరీక్ష)లో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTS) బుధవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) అధికారులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షపై తమకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదన్నారు. అయితే, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సుమోటోగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపడుతోందని.. బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ (Govind Jaiswal) తెలిపారు.ఓవైపు నీట్ యూజీ-2024 (UGC NET exam) పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, పలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. యూజీసీ-నెట్ పరీక్షను జూన్ 18 మంగళవారం దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1205 సెంటర్లలో నిర్వహించారు. ఓఎంఆర్(పెన్, పేపర్) విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, పరీక్ష సమగ్రత దెబ్బతిన్నట్టు కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కి(ఐ4సీ) చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలటిక్స్ యూనిట్ నుంచి యూజీసీకి సమాచారం వచ్చింది. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ బుధవారం వెల్లడించింది. పరీక్ష ప్రక్రియ ఉన్నత స్థాయి పారదర్శకత, పవిత్రతను కాపాడేందుకు యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసేందుకు కేంద్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Comments