TSPSC Group 1 # గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల..
TSPSC Group 1 # గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల..
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టు లకు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో ఓఎంఆర్ పద్దతిలో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే.. ఉదయం 10 గంటల తరువాత గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. జూన్ 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
Hall tickets download click here
హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బయో మెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టంచేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి అరగంటకోసారి బెల్ మోగించి పరీక్ష సమయాన్ని తెలియజేస్తామని, అవసరమైతే అభ్యర్థులు ఇన్విజిలేటర్ ను అడిగి సమయం తెలుసుకోవచ్చన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేరును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
Hall tickets download click here
హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి