TRAI: దేశంలో భారీగా పెరిగిన టెలికాం వినియోగదారుల సంఖ్య.. చివరి స్థానంలో బిఎస్ఎన్ఎల్
TRAI: దేశంలో భారీగా పెరిగిన టెలికాం వినియోగదారుల సంఖ్య.. చివరి స్థానంలో బిఎస్ఎన్ఎల్
4 47.24 కోట్ల సబ్స్కైబర్లతో టాప్ వన్ కు చేరుకున్న రిలయన్స్ జియో
రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న ఎయిర్ టెల్
భారతీ ఎయిర్టెల్ ఏప్రిల్లో దాదాపు 752000 మంది కొత్త సబ్స్కైబర్లు
ఏప్రిల్ లో 12 లక్షల మంది సబ్స్కైబర్లను కోల్పోయిన బీఎస్ఎన్ఎల్
ఏప్రిల్లో దేశంలో టెలికాం సబ్స్కైబర్ల సంఖ్య 1.2 బిలియన్లకు చేరుకుంది. టెలికాం సబ్స్కైబర్ బేస్ 1.2 బిలియన్లకు చేరడం ఇది రెండోసారి. ఇది జూలై 2017లో రికార్డు స్థాయిలో 1.21 బిలియన్లకు చేరుకుంది. వైర్లెస్ సెగ్మెంట్లో రిలయన్స్ జియో వృద్ధి కొనసాగుతోంది. ఏప్రిల్లో కంపెనీ 26.8 లక్షల మంది కొత్త సబ్స్కైబర్లను చేర్చుకుంది. దీంతో రిలయన్స్ జియో మొత్తం సబ్స్కైబర్లు 47.24 కోట్లకు చేరుకున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా ప్రకారం.. భారతీ ఎయిర్టెల్ ఏప్రిల్లో దాదాపు 7,52,000 మంది కొత్త సబ్స్కెబర్లను సంపాదించుకుంది. ఈ రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ మొత్తం సబ్స్కైబర్ల సంఖ్య దాదాపు 26.75 కోట్లకు చేరుకుంది. ఇది కాకుండా.. ఏప్రిల్లో వోడాఫోన్ ఐడియా సబ్స్కైబర్లలో సుమారు 7,35,000 తగ్గుదల ఉంది. ఏప్రిల్లో వైర్లైన్ విభాగంలో సబ్స్కైబర్ల సంఖ్య సుమారు 3.42 కోట్లకు పెరిగింది. ఈ విభాగంలో కూడా, రిలయన్స్ జియో గరిష్టంగా 3.6 లక్షల మంది కొత్త కస్టమర్లను పొందింది. అయితే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 12 లక్షల మంది సబ్స్కైబర్లను కోల్పోయింది. గత ఆర్థిక సంవత్సరంలో BSNL నికర నష్టం రూ.5,367 కోట్లకు తగ్గింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర నష్టం రూ.8,161 కోట్లు. దాని నష్టాన్ని తగ్గించడం వెనుక కారణాలు ఖర్చులు తగ్గడం, నాన్-ఆపరేటింగ్ ఆదాయం పెరగడం.గత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా BSNL ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.19,343.6 కోట్లకు చేరుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రూ.20 వేల కోట్ల లక్ష్యం కంటే తక్కువగానే ఉంది. సెల్యులార్ సేవలు, ఎంటర్ప్రైజ్ విభాగాల నుంచి కంపెనీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో క్షీణించింది. దీని ఖర్చులు దాదాపు 2.5 శాతం క్షీణించి రూ.26,683 కోట్లకు చేరుకున్నాయి. అయితే కంపెనీ ఉద్యోగుల వ్యయం 4.4 శాతం పెరిగి రూ.8,034 కోట్లకు చేరుకుంది. ఇటీవలే BSNL మూడవ దశ భారత్ నెట్ ప్రాజెక్ట్ కోసం దాదాపు 65,000 కోట్ల రూపాయల విలువైన టెండర్ను జారీ చేసింది. BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఇది తన 4G సేవను ప్రారంభిస్తోంది. భారతీ ఎయిర్టెల్.. రిలయన్స్ జియో వంటి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు దేశవ్యాప్తంగా తమ 5G నెట్వర్క్ ను ప్రారంభించాయి. దీంతో ఆయా కంపెనీల చందాదారుల సంఖ్య కూడా పెరుగుతోంది.