TG PECET | టీజీ పీఈసెట్ 2024 ఫలితాలు విడుదల.. 96.48 శాతం ఉత్తీర్ణత నమోదు
TG PECET | టీజీ పీఈసెట్ 2024 ఫలితాలు విడుదల.. 96.48 శాతం ఉత్తీర్ణత నమోదు
TG PECET | బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. బీపీఈడీ, డీపీఈడీ విభాగాల్లో కలిపి 96.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
TG PECET | హైదరాబాద్ : బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. బీపీఈడీ, డీపీఈడీ విభాగాల్లో కలిపి 96.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీపీఈడీకి 1650 మంది దరఖాస్తు చేయగా, 1198 మంది పరీక్షకు హాజరయ్యారు. 1156 మంది (96.49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. డీపీఈడీకి 742 మంది దరఖాస్తు చేయగా, 507 మంది హాజరయ్యారు. 96.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ఈ వెబ్సైట్ లింక్ను https://pecet.tsche.ac.in క్లిక్ చేయండి ఈ నెల 10 నుంచి 13 వరకు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్కిల్ టెస్టులను నిర్వహించారు. 10, 11వ తేదీల్లో పురుషులకు, 12, 13వ తేదీల్లో మహిళలకు టెస్టులను నిర్వహించారు.