TG DSC: డిఎస్సీ పరీక్షల తేదీలు విడుదల..!
TG DSC: డిఎస్సీ పరీక్షల తేదీలు విడుదల..!
రెండు షిఫ్ట్‌లలో పరీక్షల నిర్వహణ
జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు
11 వేల ఉద్యోగాలకు 2.79 లక్షల మంది దరఖాస్తు
తెలంగాణలో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష
జులై 24న స్కూల్ అసిస్టెంట్ - బయలాజికల్ సైన్స్ పరీక్ష
జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష.