-Advertisement-

Sweet Corn : స్వీట్ కార్న్ తో ఆరోగ్య ప్రయోజనాలు.!

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news sweet corn Benifits and advantages
Janu

Sweet Corn : స్వీట్ కార్న్ తో ఆరోగ్య ప్రయోజనాలు.! 

కాలాల‌తో సంబంధం లేకుండా ఏడాదిలోని అన్ని సీజ‌న్‌ల‌లో ఈ తియ్యటి మ‌క్కజొన్నలు ల‌భిస్తాయి. ఈ మ‌క్కజొన్నల‌ను ప‌చ్చివిగా తిన్నా, ఉడ‌కబెట్టుకుని తిన్నా, ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి వండుకుని తిన్నా రుచిగా ఉంటాయి. రుచికి మాత్రమే కాదు, ఈ మ‌క్కజొన్నల‌తో తయారు చేసుకునే ప‌దార్థాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే మీ డైట్‌లో స్వీట్‌ కార్న్‌ ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకుందాం..

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news sweet corn Benifits and advantages

స్వీట్‌ కార్న్‌తో ఉపయోగాలు..

1. తియ్యటి మ‌క్కజొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్‌లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్‌, లివర్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీల‌క పాత్ర పోషిస్తాయి.

2. ఇక స్వీట్‌కార్న్‌ అంటేనే ఫైబర్‌కు చిరునామాగా చెప్పవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుప‌ర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ మంచి ప‌రిష్కార‌మ‌ని చెప్పవ‌చ్చు.

3. స్వీట్‌కార్న్‌ల‌లో ఉండే విటమిన్‌-సి, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే‌ విటమిన్ బి-12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడుతాయి.

4. అదేవిధంగా తియ్యటి మ‌క్కజొన్నల్లోని ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి ఖ‌నిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుప‌డేలా చేస్తాయి.

5. నిత్యం ఒత్తిళ్లతో ప‌నిచేసే వారికి స్వీట్‌ కార్న్‌ మంచి మందులా పనిచేస్తుంది. అందులో ఉండే ఫినోలిక్‌ ఫైటో కెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి.

6. స్వీట్‌ కార్న్‌లు‌ చాలా వేగంగా జీర్ణమ‌వుతాయి. అందువ‌ల్ల శరీరానికి త‌క్షణ‌మే కావాల్సినంత‌ శక్తి వస్తుంది. అందువ‌ల్ల స్వీట్‌కార్న్‌ను ప్రతిరోజూ కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Comments

-Advertisement-