Smoking: ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా?
Smoking: ధూమపానంతో పురుషులు లైంగిక శక్తిని కోల్పోతారా?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.” ఈ హెచ్చరికలు తరచుగా వింటుంటాం. చదువుతూ ఉంటాం. కానీ చాలా మంది ధూమపానం ఊపిరితిత్తులకు మాత్రమే హానికరం అని నమ్ముతారు. ధూమపానం (స్మోకింగ్ సైడ్ ఎఫెక్ట్స్) మీ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాలను కలిగి ఉండటమే కాకుండా.. అనేక ఇతర మార్గాల్లో కూడా మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం మని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం మీ గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం మీ మొత్తం హృదయనాళ వ్యవస్థకు హాని చేస్తుంది. నిజానికి, పొగాకులో ఉండే నికోటిన్ రక్తనాళాలపై ఒత్తిడిని పెంచడానికి పనిచేస్తుంది. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. క్రమంగా పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వంటి సమస్యలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా ధూమపానం అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
ధూమపానం సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పొగాకులో ఉండే నికోటిన్ పురుషులు, స్త్రీల జననేంద్రియాలలో రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా పురుషులు లైంగిక శక్తిని కోల్పోవచ్చు. అయితే మహిళలు అన్ని రకాల లైంగిక సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ధూమపానం మగ, ఆడ ఇద్దరిలో సెక్స్ హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది. లైంగిక కోరికను కూడా తగ్గిస్తుంది. పొగతాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. పొగాకు పొగలో హానికరమైన పదార్థాలు ఉన్నాయని, ఇది చర్మం నిర్మాణంలో ప్రతికూల మార్పులను తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల ప్రకారం.. ధూమపానం పొలుసుల కణ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అనగా అది చర్మ క్యాన్సర్. అంతే కాదు.. పొగతాగడం వల్ల గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పొగాకులో ఉండే నికోటిన్ కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు నెరిసిపోవడానికి కూడా కారణమవుతుంది.