-Advertisement-

Sleeping: ప్రతిరోజు రాత్రి లేటుగా నిద్రపోతున్నారా.. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..!

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness sleeping benefits Sleeping problems Sleeping issu
Pavani

Sleeping: ప్రతిరోజు రాత్రి లేటుగా నిద్రపోతున్నారా.. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..!

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness sleeping benefits  Sleeping problems Sleeping issu

ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు..

మెదడు సంబంధిత రోగాలకు గురి..

ఒక్కోసారి మెంటల్ డిసార్డర్ కు గురి అవ్వడం జరుగుతుంది..

ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రజల యొక్క జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా మనిషి నిద్ర సమయాలు పూర్తిగా మారాయి. రాత్రిళ్ళు ఎప్పుడో గాని పనులు పూర్తిచేసుకుని నిద్రపోవడం చాలా మందికి పరిపాటిగా మారిపోయింది. ఇలా నిద్రపోవడం వల్ల మనిషికి అనేకమైన అనారోగ్య సమస్యలు వాటికి గురవుతున్నారని తాజాగా లండన్ లోని ఒక కాలేజ్ అధ్యయనాన్ని చేసింది. ఈ పరిశోధనలో రాత్రి ఒంటిగంట సమయంలోపు నిద్రపోయే వ్యక్తుల మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుందని స్టడీలో తెలియజేశారు. ఈ అధ్యాయంలో మొత్తంగా 73 వేలకు పైగా మందిని పరిశోధించారు.ఇక ఈ అధ్యాయంలో రాత్రి ఒంటిగంట లోపల పడుకునే వారిలో న్యూరో డెవలప్మెంట్ డిసీజెస్, జర్నలైసేడ్ యాంగ్సిటీ డిసార్డర్, మెంటల్ బిహేవియర్ లాంటి వాటిలో చాలా తక్కువ ప్రభావితం కనబడినట్లు పేర్కొన్నారు. అలాగే ఒంటిగంట తర్వాత కూడా మేల్కొని ఉండేవారిలో అనేక మానసిక ఆరోగ్య స్థితులు ఉన్నట్లు వారు గుర్తించారు. ఇక మొత్తానికి ఈ స్టడీ ప్రకారంగా చూస్తే.. రాత్రుల సమయంలో ప్రతి ఒక్కరు వీలైనంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోతే గనక మానసిక అనారోగ్యం పాడవకుండా ఉండాలని పేర్కొన్నారు. ఇకపోతే మనిషి నిద్ర అనేది మెదడు జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి., అలాగే మెదడు జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి అలాగే భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి అలాగే నిర్ణయం తీసుకోవడం లాంటి క్రిటికల్ ఫంక్షన్స్ ని నిర్వహించడానికి నిద్ర ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు.నిద్రపోతున్న సమయంలో మన మెదడు ప్రతిరోజు జరిగే సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందని., మనం నేర్చుకున్న వాటిని పటిష్టంగా ఉంచుకొనేలా తయారు చేస్తుందని వారు వివరించారు. అంతేగాక మరుసటి రోజు సమస్యలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా చేస్తుంది. ఇక నిద్రలేమి వల్ల ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులకు గురవుతారని ఈ పరిశోధన తెలిపింది. ముఖ్యంగా ఎమోషనల్, సైకలాజికల్ కండిషన్స్ కు తగ్గట్టుగా మెదడు పనిచేసేందుకు నిద్ర చాలా అవసరమైనదని పరిశోధన తెలిపింది. ఒక్కోసారి నిద్రలేమి వల్ల మానసిక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు వారు నిర్ధారించారు. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా కానీ రాత్రి పూట వీలైనంత సమయం పడుకోవడానికి కేటాయించండి.

Comments

-Advertisement-