Sleeping: ఒంటరితనానికి నిద్రనే పరిష్కారం..తాజా అధ్యయనంలో వెల్లడి
Sleeping: ఒంటరితనానికి నిద్రనే పరిష్కారం..తాజా అధ్యయనంలో వెల్లడి
ఒంటరితనానికి నిద్రనే పరిష్కారం..
తాజా అధ్యయనంలో వెల్లడి..
2900 మందిపై పరిశోధన..
Loneliness: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక సమస్యల్లో ఒకటి “ఒంటరితనం". ప్రస్తుతం ఒంటరితనం అనేది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా గుర్తించబడుతోంది. అయితే, శరీరంలోనే ఏదైనా అనారోగ్యం వల్లే దీనికి సంప్రదాయ వైద్య చికిత్స అనేది లేదు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో డిప్రెషన్, ఒత్తిడి, కొన్నిసార్లు ఒంటరితనం అనేది ఆత్మహత్యని కూడా ప్రేరేపించే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ అధ్యయనం మాత్రం “ఒంటరితనం”కి చెక్ పెట్టే విషయాన్ని కనుగొంది. “నాణ్యమైన నిద్ర” ఒంటరితనాన్ని అధిగమించడంలో సాయపడుతుందని తేలింది. పరిశోధకులు దాదాపు 2,300 మంది పెద్దల సర్వే నిర్వహించారు. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు, భావోద్వేగ ఒంటరితనం మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. నిద్ర అనేది ఒంటరితనాన్ని తగ్గించడానికి ప్రభావవంతమైన మార్గం అని అధ్యయనం సూచిస్తుంది. అయితే, ఒంటరితనం విస్తృత ప్రభావాలను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి మరింత పరిశోధన అవసరం అని అధ్యయనం సూచించింది.
వయస్సు కారణంగా కాకపోయినా, మానసిక ఒంటరితనంతో ఉన్న యువకులు ఆరోగ్యకరమైన నిద్ర నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని పరిశోధకులు కనుగొన్నారు. 2297 మంది( సగటు వయసు 44, అంతకన్నా ఎక్కువ మంది పురుషులు) పై జరిగిన అద్యయనంలో ఆన్లైన్ స్లీప్ హెల్త్ ప్రశ్నాపత్రంతో పాటు డిజోంగ్ గిర్వెల్డ్ లోన్లీనెస్ స్కేల్ ఉపయోగించారు.