-Advertisement-

SBI: ఎస్బీఐ చైర్మన్‌గా తెలుగు బిడ్డ

SBI Chairman in india Govt jobs telugu Latest Govt Jobs notifications Government jobs after 12th Govt Jobs 2024 Govt Jobs in AP Central Government Job
Pavani

SBI: ఎస్బీఐ చైర్మన్‌గా తెలుగు బిడ్డ

ఎస్బీఐ చైర్మన్‌గా పాలమూరు జిల్లాకు చెందిన సీహెచ్ శెట్టి ఎంపిక

తదుపరి చైర్మన్‌గా శెట్టిని ఎంపిక చేసిన ఎఫ్ఎస్ఐబీ 

ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సీహెచ్ శెట్టి

అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న శెట్టి

భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సీఎస్ శెట్టిని చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో సిఫారస్ చేసింది. 

SBI Bank Manager name list SBI Branch Manager contact number list SBI MD and CEO 4 MD of SBI SBI Chief General Manager list SBI Chairman in india

ప్రస్తుతం సంస్థ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా ఈ ఏఢాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్ నియమించడానికి ఎఫ్ఎస్‌ఐబీ పలువురు సీనియర్ ఉన్నతాధికారులను శనివారం ఇంటర్వ్యూ చేసింది. వీరిలో శెట్టి కూడా ఒకరు. బ్యాంకులో వారి పనితీరు అనుభవం, ప్రస్తుత పరిమితులను దృష్టిలో పెట్టుకుని చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫారసు చేసినట్టు ఎఫ్ఎస్ఐబీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ (ఏసీసీ) కమిటీ సమావేహై ఎఫ్ఎస్ఐబీ సూచించిన వ్యక్తిపై తుది నిర్ణయం తీసుకోనున్నది. 

ఎస్బీఐ ఎండీగా జనవరి 2020లో శెట్టి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ వర్టికల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి శెట్టి బేసిక్ వేతనం 26.3 లక్షలు, డీఏ కింద మరో రూ. 9.7 లక్షలు అందుకున్నారు. 

పాలమూరు జిల్లా నుంచి..

శ్రీనివాసులు శెట్టి జన్మస్థలం జోగులాంబ గద్వాల జిల్లా (ఉమ్మడి మహబూబ్నగర్), మానవపాడు మండలం, పెద్దపోతులపాడు గ్రామం. ఏడో తరగతి వరకూ సొంతూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకూ గద్వా లలో విద్యాభ్యాసం జరిగింది. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్ సీ అగ్రికల్చర్ చదివారు. ఆ తర్వాత 1988లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీ స౦గా చేరారు. గుజరాత్, హైదరాబాద్, ముంబయితో పాటు న్యూయార్క్లోనూ పనిచేశారు. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2020 నుంచి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా కొనసాగుతు న్నారు. ప్రస్తుతం ఉన్న ఎండీల్లో అందరి కంటే సీనియర్ ఈయనే కావడంతో సంప్రదాయం ప్రకారం ఈయన పేరును చైర్మన్ పదవికి సిఫారసు చేశారు.

Comments

-Advertisement-