-Advertisement-

Ration Card: ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేయని వారికి మరో అవకాశం

Can I link Aadhar to ration card at home? How to check whether ration card is linked with Aadhaar? What is the last date for linking Aadhaar and ratio
Priya

Ration Card: ఆధార్-రేషన్ కార్డ్ లింక్ చేయని వారికి మరో అవకాశం

ఈ నెల 30తో ముగియనున్న గడువు

మరో మూడు నెలలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

సెప్టెంబర్ 30 వరకు పొడిగించిన కేంద్రం

డిల్లీ (పీపుల్స్ మోటివేషన్)

ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరోసారి అవకాశమిచ్చింది. ఈ రెండూ లింక్ చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 30వ తేదీతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో గడువును మరో మూడు నెలలు పొడిగించింది. రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును లింక్ చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది.

Can I link Aadhar to ration card at home? How to check whether ration card is linked with Aadhaar? What is the last date for linking Aadhaar with ration card in West Bengal?

ఈ రెండింటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. సమీపంలోని రేషన్ దుకాణం లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో అనుసంధానం పూర్తి చేసుకోవచ్చు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా అనుసంధానం చేయవచ్చు.

Comments

-Advertisement-