-Advertisement-

Rail Accident: 'కవచ్' ఉంటే రైలు ప్రమాదం తప్పేదా? ఏంటీ ఈ కవచ్ ?

kavach india kavach train kavach app kavach download kavach login kavach download for pc kavach system upsc kavach meaning Telugu daily news Flash ne
Pavani

Rail Accident: 'కవచ్' ఉంటే రైలు ప్రమాదం తప్పేదా? ఏంటీ ఈ కవచ్ ?

బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వైఫల్యం కన్పిస్తోంది. మరోవైపు ఈ మార్గంలో 'కవచ్ (Kavach)' రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ప్రమాదం తప్పేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటీ వ్యవస్థ..?

kavach india kavach train kavach app kavach download kavach login kavach download for pc kavach system upsc kavach meaning
ఒకే ట్రాక్పైకి రెండు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థే 'కవచ్ (Kavach)'. ఈ సాంకేతికత అందుబాటులో ఉండి ఉంటే.. పశ్చిమబెంగాల్ (West Bengal) లోని దార్జిలింగ్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం (Train Accident) తప్పేదని పలువురు నిపుణులుఅభిప్రాయపడుతున్నారు. రైల్వేకు రక్షణ కవచం లాంటి ఈ వ్యవస్థ ఈ మార్గంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. తాజా దుర్ఘటన నేపథ్యంలో 'కవచ్' మరోసారి చర్చకు వచ్చింది. గతంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 'కవచ్' వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

ఏంటీ కవచ్ వ్యవస్థ..

రైళ్ల రాకపోకలకు నియంత్రించేందుకు భారత రైల్వే గత కొన్నేళ్లుగా విదేశీ సాంకేతికతపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే దేశీయంగా టెక్నాలజీని అభివృద్ధి చేసి రైల్వేలో స్వావలంబన సాధించాలని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే రీసర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RSDO).. మేధా సర్వో డ్రైవ్స్, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ కలిసి 'ట్రైన్ కొలిజన్ అవైడెన్స్ సిస్టమ్ (TCAS)' అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనిని భారతీయ రైల్వే ఆమోదించింది. దీన్నే ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్, కవచ్ (Kavach) గా పిలుస్తున్నారు.

ఎలా పనిచేస్తుంది..?

రైల్వేల్లో ‘సున్నా ప్రమాదాలే' లక్ష్యంగా ఈ కవచ్ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు ప్రమాదం ఎదురైనప్పుడు రైలు దానంతటే అదే ఆగిపోయే ఈ టెక్నాలజీని రూపొందించారు. ఉదాహరణకు ఒక రైలువెళ్తాన్న మార్గంలోనే కొంత దూరంలో మరో రైలు కూడా ప్రయాణిస్తున్నప్పుడు.. ఈ 'కవచ్' టెక్నాలజీ వెంటనే సెన్సర్లతో గుర్తిస్తుంది. దీంతో రైలు ఆటోమేటిక్గా గా ఆగిపోతుంది. రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే.. ఈ వ్యవస్థతో ఆటోమెటిక్ గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రైలును ఆపేస్తుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే.. కవచ్లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది.

Comments

-Advertisement-