PM Kisan: పీఎం కిసాన్ నిధి పేమెంట్ పడిందా? లేదా?.. ఈజీగా ఇలా చూసుకోండి!
PM Kisan: పీఎం కిసాన్ నిధి పేమెంట్ పడిందా? లేదా?.. ఈజీగా ఇలా చూసుకోండి!
దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ మనీ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చేది 2 వేలే అయినా.. ఆ మనీ కూడా వారికి చాలా అవసరం. అయితే.. కొంతమంది రైతుల పేర్లను కేంద్రం తొలగిస్తోంది. మరి మీ పేరు ఉందో లేదో ఇలా చూసుకోండి.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 3 విడతల్లో మొత్తం రూ.6 వేలు ఇస్తోంది. ఈ మనీ లబ్దిదారులైన రైతుల బ్యాంక్ అకౌంట్లలో డైరెక్టుగా పడుతోంది. అందువల్ల రైతులు తమ మొబైల్‌కి మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ ఉంటే.. మనీ పడగానే, మెసేజ్ వచ్చేస్తుంది.
ఈసారి 17వ విడత మనీని జూన్ 18న అకౌంట్లలో వేస్తోంది. దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మందికి పైగా రైతుల అకౌంట్లలో రూ.21 కోట్లను జమ చేస్తోంది. ఎన్నికల్లో మూడోసారి గెలిచాక, ప్రధాని మోదీ.. జూన్ 18న తన సొంత నియోజకవర్గం వారణాసికి వెళ్తున్నారు. ఆ రోజు అక్కడి నుంచి ఈ మనీ రిలీజ్ చేస్తారు.
పీఎం కిసాన్ పథకంలో ప్రతీ నెలా కొత్తగా లబ్దిదారులు చేరుతున్నారు. అలాగే ఉన్న వారిలో కొందరి పేర్లను తొలగిస్తున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. KYC పూర్తి చెయ్యని వారు, సరైన పత్రాలు సమర్పించని వారు, చనిపోయిన రైతుల పేర్లను తొలగిస్తున్నారు. ఐతే.. ఇలాంటి సందర్భంలో.. పొరపాటున కొందరి పేర్లు లిస్ట్ నుంచి పోతున్నాయి. అలా మీ పేరు తొలగితే, మీకు మనీ రాదు. అందువల్ల మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం మేలు.
పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవడానికి ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)కి వెళ్లండి. అక్కడ కిందకు స్క్రాల్ చేసినప్పుడు ఫార్మర్స్ కార్నర్ (Farmers Corner) అనే విభాగం కనిపిస్తుంది. ఆ విభాగంలోని Know Your Status క్లిక్ చెయ్యాలి.
Know Your Status క్లిక్ చేసినప్పుడు ప్రత్యేక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లబ్దిదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత పక్కన కాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత Get OTP క్లిక్ చెయ్యాలి. వారి మొబైల్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చెయ్యాలి. అప్పుడు లబ్దిదారుల లిస్ట్ ఓపెన్ అవుతుంది. తద్వారా మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
కొంతమందికి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటో గుర్తు ఉండకపోవచ్చు. అలాంటి వారు.. Know Your Status క్లిక్ చెయ్యాలి. అక్కడ ఓపెన్ అయ్యే పేజీలో Know your registration no ఆప్షన్ ఎంచుకోవాలి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వడం ద్వారా.. రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా.. తిరిగి జాబితాలో మీరు ఉందో లేదో చూసుకోవచ్చు.