No Plastic Use: ఆ కవర్లలో ఆహారం తీసుకోవద్దు..
No Plastic Use: ఆ కవర్లలో ఆహారం తీసుకోవద్దు..
ఆహారం పార్శిల్ చేసినపుడు ప్లాస్టిక్ వాడకంపై ఇన్స్టా వేదికగా ఓ నిపుణుడు ఆందోళన వ్యక్తంచేశారు. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లకు ట్యాగ్ చేశారు. దీనిపై జొమాటో సీఈఓ స్పందించారు.
ప్లాస్టిక్ వినియోగం పెరగడంపై చాలాకాలంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ ప్లాస్టిక్ భూతం గురించి ఎందరో నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇటీవలే లైఫ్ స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో హాట్ ఫుడ్ ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ బాక్స్ లు ఉపయోగించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. వాటివల్ల కలిగే ప్రమాదాల గురించి తీవ్ర ఆందోళనలు వ్యక్తంచేశారు. అంతే కాదు ఫుడ్ డెలివరీలు అందించే సంస్థలను ట్యాగ్ చేశారు.
ప్లాస్టిక్ కవర్లు, బాక్సుల్లో వేడి ఆహారపదార్థాలు వేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని కౌటిన్హో తెలిపారు. "ఆహారం వేడిగా ఉండాలని ఆర్డర్ పెట్టే ప్రతీ యూజర్ కోరుకుంటారు. దీంతో రెస్టారంట్లు ఫుడ్ను ఎక్కువ వేడి చేసి అలానే ప్లాస్టిక్ బాక్స్ అందిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి ఆహారం తినడం వల్ల అనారోగ్యం బారినపడతారు” అని ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే వచ్చే సమస్యల గురించి ప్రస్తావించారు.
రెస్టారంట్లు ప్లాస్టిక్ వినియోగించకుండానే ఫుడ్ ఆర్డర్లు అందిస్తున్నాయి. ఈ మార్పు తెచ్చే సత్తా మీకుంది” అని రాసుకొచ్చారు. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) స్పందించారు. “ఇలాంటి ఆలోచన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నాన్- ప్లాస్టిక్ వైపు మారేందుకు ప్రయత్నం చేస్తాం. ఇకపై సురక్షితమైన ఆహార ప్యాకేజింగ్ అందించే రెస్టారంట్లను హైలైట్ చేస్తాం. ఇ కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుంది” అని సమాధానమిచ్చారు. అంటే ఇకపై జొమాటోలో ప్యాకింగ్ విషయంలోనూ ప్రత్యేక ఎంపికలు ఉండనున్నట్లు తెలుస్తోంది.