National Anthem: అక్కడ పాఠశాలల్లో జాతీయగీతం తప్పనిసరి..ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
అక్కడ పాఠశాలల్లో జాతీయగీతం తప్పనిసరి..ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
శ్రీనగర్, జూన్ 14(పీపుల్స్ మోటివేషన్):
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని పాడుతారు. అయితే, జమ్మూకశ్మీర్ లోని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని కచ్చితంగా ఆలపించాలనే నియమం లేదు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్ధనా సమయంలో ఈ గీతాన్ని తప్పనిసరి చేయాలని జమ్మూ కశ్మీర్ పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ఉదయం నిర్వహించే అసెంబ్లీ విద్యార్థుల మధ్య ఐక్యత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం కోసం వక్తలను ఆహ్వానించాలని సూచించారు. విద్యార్థులకు సమాజంలోని పరిస్థితులు, భిన్నమైన సంస్కృతులు, చారిత్రక విషయాలు, పర్యావరణంపై అవగాహన వంటి 16 అంశాలను పాఠశాలల్లో తప్పనిసరిగా పాటించాలని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.