NAAS: వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషుమాధవ్ కు NAAS అత్యున్నత పురస్కారం
వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషుమాధవ్ కు NAAS అత్యున్నత పురస్కారం
మూడు దశాబ్దాలుగా వరి, పొగాకు పంటలపై పరిశోధనలు చేస్తున్న కేంద్ర పొగాకు పరిశోధవ సంస్థ డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషుమాధవ్ కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ (నేషనల్ ఆకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ NAAS) అత్యున్నత పురస్కారం దక్కింది.
దిల్లీలో జరిగిన NAAS వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ హిమాంశుపాఠక్ దీనిని శేషుమాధన్కు ప్రదానం చేశారు.
హనుమకొండకు చెందిన శేషుమాధవ్ దిల్లీలోని వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెన్రి చేసిన అనంతరం అమెరికాలోని ఒహాయో స్టేట్ వర్సిటీలో మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీలో పోస్ట్ డాక్టరేట్ పొందారు.
అంతర్జాతీయ వ్యవసాయ జర్నల్స్ లో 178 పరిశోధన వ్యాసాలు రాశారు. ప్రస్తుత భారత వ్యవసాయ పరిశోధనమండలిలో పాలకవర్గ సభ్యులుగా ఉన్నారు.